Central Govt Employees Salaries Hike Like This After 8th Pay Commission Implement: ప్రభుత్వ ఉద్యోగులకు 8వ వేతన సంఘం భారీగా ఊరిస్తోంది. భారీగా జీతాల పెంపు ఉంటుందని ఉద్యోగ వర్గాలు ఆశిస్తున్నాయి. కొత్త వేతన సంఘం ద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో ఏ ఉద్యోగికి ఏ స్థాయిలో జీతాలు పెరుగుతాయనే ఆసక్తి నెలకొంది. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఆధారంగా ఈ ఉద్యోగ స్థాయిలకు ఈ విధంగా జీతాలు పెరిగే అవకాశం ఉంది.
8వ వేతన సంఘం అమలైతే ఏ ఉద్యోగికి ఏ స్థాయిలో వేతన పెరుగుదల ఉంటుందనేది ఆసక్తికరంగా చర్చ జరుగుతోంది. ఉద్యోగ వర్గాల చర్చ జరుగుతున్న ప్రకారం జీతాల పెంపు ఇలా ఉంది.
ప్యూన్లు, అటెండర్లు, సహాయక సిబ్బందికి సంబంధించిన మూల వేతనం గతంలో రూ.18,000 ఉండగా.. వీరి మూల వేతనం రూ.51,480కి సవరించబడుతుంది. ఫలితంగా వీరి జీతం రూ.33,480 పెరిగే అవకాశం ఉంది.
క్లరికల్ విధులకు బాధ్యత వహించే దిగువ డివిజన్ క్లర్క్‌లకు కనీస వేతనం రూ.19,900 నుంచి రూ.56,914కి పెంచే అవకాశం ఉంది. ఇలా పెరిగితే జీతం పెరుగుదల రూ.37,014 ఉండవచ్చు.
పోలీసు, పబ్లిక్ సర్వీసెస్‌లో కానిస్టేబుళ్లు , నైపుణ్యం కలిగిన సిబ్బందికి రూ.21,700గా ఉన్న మూలవేతనం రూ.62,062కు పెరిగే ఆస్కారం ఉంది. దీని ఆధారంగా వేతనం పెంపు రూ.40,362 ఉండే అవకాశం ఉంది.
గ్రేడ్ డీ స్టెనోగ్రాఫర్లు, జూనియర్ క్లర్క్‌ల మూల వేతనం రూ.25,500 ఉండగా.. రూ.47,430 పెరిగే చాన్స్ ఉంది. ఇలా చూస్తే రూ.72,930కి జీతం పెరుగుదల ఉండనుంది.
సీనియర్ క్లర్క్‌లు, ఉన్నత స్థాయి సాంకేతిక సిబ్బందికి రూ.29,200 ఉన్న కనీస వేతనం రూ.83,512కు పెరిగే అవకాశం ఉంది. ఫలితంగా రూ.54,312కు జీతం పెరిగే అవకాశం ఉంది.
ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్ల కనీస వేతనం రూ.35,400 నుంచి రూ.1,01,244కి పెరగనుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. దీని ఆధారంగా రూ.65,844 భారీ పెరుగుదల ఉండనుంది.
సూపరింటెండెంట్లు, సెక్షన్ ఆఫీసర్లు, అసిస్టెంట్ ఇంజనీర్ల మూల వేతనం రూ.44,900 నుంచి రూ. 83,514 పెరిగే అవకాశం ఉండగా.. రూ.1,28,414కి వేతనం సవరించబడుతుందని అంచనా.
సీనియర్ సెక్షన్ ఆఫీసర్లు, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్లకు రూ.47,600గా ఉన్న మూలవేతనం రూ.88,536 పెరిగే అవకాశం ఉంది. దీని ఆధారంగా వారి జీతం పెరుగుదల రూ.1,36,136 ఉండవచ్చు.