Sonu Sood Ambulance: కరోనా సమయంలో వేలాది మందికి అండగా నిలిచిన సినీ హీరో సోనూసూద్ ఆంధ్రప్రదేశ్‌కు కూడా సహాయం అందించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్‌కు 'ఆపద్బాంధవుడి'లా మారాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సోనూసూద్ తన ఫౌండేషన్ పేరిట అంబులెన్సులను విరాళంగా ఇచ్చారు. వైద్య సేవలకు అత్యవసరమైన అంబులెన్స్‌లను అందించి ఏపీలో ప్రమాద బాధితులకు సూద్ అండగా నిలవనున్నాడు.
Also Read: Hindupur: హిందూ'పురం' కైవసం.. వైఎస్ జగన్‌కు బాలకృష్ణ దెబ్బ అదుర్స్!
ఆరోగ్యం-సామాజిక సంక్షేమం విషయంలో సేవలు అందించే ‘సూద్ చారిటీ ఫౌండేషన్’ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజారోగ్య సంరక్షణ కోసం 4 అంబులెన్స్‌లను ప్రభుత్వానికి అందించింది. సినీ నటుడు, సూద్ ఛారిటీ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సోనూ సూద్ సోమవారం సీఎం చంద్రబాబును కలిశారు. రాజధాని అమరావతిలోని సచివాలయంలో సీఎంతో సోనూసూద్ మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. అనంతరం తాను నాలుగు అంబులెన్స్ వాహనాలను ఇస్తున్నట్లు చెప్పి వాటికి సంబంధించిన తాళాలను అందించారు.
Also Read: Nara Lokesh: 'ఇది జగన్ ప్యాలెస్ కాదయ్యా.. ఎందుకింత బందోబస్తు'.. లోకేశ్ ఆన్ ద ఫైర్
అత్యవసర సమయాల్లో రోగులను ఆస్పత్రికి తరలించేందుకు.. సుదూర ప్రాంతాల్లో క్లిష్టమైన వైద్య సేవలు అందించేందుకు వీలుగా అంబులెన్సులు ఇచ్చినట్లు సోనూసూద్ వెల్లడించారు. తాను అందించిన అంబులెన్సులతో ఆపదలో ఉన్నవారికి భరోసా లభిస్తుందని సోనూసూద్ ఆశాభావం వ్యక్తం చేశారు. అంబులెన్స్‌లు ఇచ్చిన సినీ నటుడిని సీఎం చంద్రబాబు అభినందించారు. రాష్ట్రంలో మారుమూల ప్రాంతాలకు అత్యవసర వైద్య చికిత్సలు, అత్యాధునిక సౌకర్యాలతో వైద్యం అందేలా తాము చేస్తున్నట్లు ఈ సందర్భంగా సోనూసూద్‌కు సీఎం వివరించారు. ఆరోగ్య సంరక్షణలో మౌలిక సదుపాయాలను కల్పించడానికి తాము ప్రాధాన్యం ఇస్తున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. అంతకుముందు సీఎం కార్యాలయంలో కొన్ని నిమిషాల పాటు సోనూసూద్ చంద్రబాబుతో మాట్లాడారు. వారిద్దరి కొన్ని రాజకీయ, సినిమాలతోపాటు ఇతర అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.