Jaya bachchan on kumbhmela stampede: ప్రయాగ్ రాజ్ కుంభమేళ పుణ్యస్నానాలకు ప్రపంచ వ్యాప్తంగా భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు దాదాపు.. 35 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచారించారని తెలుస్తొంది. ఇదిలా ఉండగా.. గతనెల జనవరి మౌనీ అమావాస్య నేపథ్యంలో షాహి స్నానం ఆచరించేందుకు భక్తులు పొటెత్తారు. దీంతో త్రివేణి సంగమం వద్ద తెల్లవారు జామున రెండు గంటల ప్రాంతంలో సెక్టార్ నెంబరు రెండో ప్రాంతంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. దీంతో భక్తులంతా ఒక్కసారిగా ఆ ప్రాంతంనుంచి పరుగులు పెట్టారు.
ఆ ప్రదేశంలో భక్తులంతా ఒకరి మీద మరోకరు పడిపోయారు. దీనిపై యోగి సర్కారు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. ఈ ఘటనలో ౩౦ మంది మరణించారని, మరో 60 మంది గాయపడ్డారని యోగి ప్రభుత్వం వెల్లడించింది. అదేవిధంగా చనిపోయిన కుటుంబాలకు రూ. 25 లక్షల పరిహారంను యోగి ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో ఈ ఘటనపై త్రిసభ్య కమిషన్ ను సైతం నియమించింది. నెలరోజుల్లో నివేదిక ఇవ్వాలని కూడా ప్రభుత్వం ఆదేశించింది.
ఘటన వెనుకాల కుట్రకోణం ఉందని ప్రభుత్వానికి పలు నివేదికలు అందాయి. తొక్కిసలాట జరిగిన ప్రదేశంలో దాదాపు.. 16 వేల ఫోన్ డాటాను అధికారులు విశ్లేషిస్తున్నారు. ఘటన వెనకాల ఉన్న ఎవర్ని వదిలేదిలేదని స్పష్టం చేసింది. అయితే.. ఈ ఘటనపై తాజాగా.. సమాజ్ వాది ఎంపీ జయాబచ్చన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తొక్కిసలాటలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. యూపీ ప్రభుత్వం ఘటన జరిగిన తర్వాత.. శవాలను త్రివేణి సంగమంలో పడేసిందని షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం దేశంలో అత్యంత కలుషితమైన నీళ్లుగా త్రివేణి సంగమం మారిందన్నారు. కుంభమేళకు ఎంత మంది వస్తున్నారో ప్రకటిస్తున్న ప్రభుత్వం.. అక్కడ భక్తులకు కల్గుతున్న ఇబ్బందుల గురించి ఎందుకు మాట్లాడట్లేదన్నారు.
Read more: West bengal: భర్త కిడ్నీ అమ్మి ప్రియుడితో జంప్ ఘటన.. వెలుగులోకి వస్తున్న నరాలు తెగే వాస్తవాలు...?..
ఈ క్రమంలో ఎంపీ జయాబచ్చన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారంగా మారాయి. దీనిపై సోషల్ మీడియా వేదికగా అనేక మంది మండిపడుతున్నారు. మరోవైపు జన్వరి 13న ప్రారంభమైన కుంభమేళ, ఫిబ్రవరి 26 మహా శివరాత్రి షాహి స్నానంతో ముగియనుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter