US Deports Indian Migrants: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనంత పని చేశారు. అధ్యక్ష పదవి చేపట్టినప్పటి నుంచి కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న ఆయన..ఇప్పుడు వలసదారులను లక్ష్యంగా చేసుకున్నారు. దీంతో అమెరికా చరిత్రలోనే అతిపెద్ద అక్రమ వలసదారుల బహిష్కరణ ఆపరేషన్ షురూ అయ్యింది. అక్రమంగా ఉంటున్న వారిని గుర్తించిన అధికారులు ఆయా దేశాలకు ప్రత్యేక విమానాల్లో పంపించేస్తున్నారు. తాజాగా భారత్ కు చెందిన అక్రమ వలసదారులతో కూడిన మిలటరీ విమానం భారత్ కు బయలుదేరింది. అందులో 250 మంది భారతీయులు ఉన్నట్లు జాతీయ మీడియా పేర్కొంది.
ఈ విషయాన్ని అక్కడి అధికారులు వెల్లడించినట్లు ప్రముఖ న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్ పేర్కొంది. సీ17 ఎయిర్ క్రాఫ్ట్ లో అక్రమ వలసదారులను తరలిస్తున్నట్లు సమాచారం. ఈ ఫ్లైట్ భారత్ కు చేరుకునేందుకు సుమారు 24గంటల సమయం పడుతుందని అంచనా. అయితే ఎంత మంది వలసదారులను తరలిస్తున్నారన్న విషయంపై కచ్చితమైన క్లారిటీ లేదు.
Also Read: Maha kumbhmela: నదిలో శవాలను పారేశారు.. కుంభమేళ తొక్కిసలాటపై ఎంపీ సంచలన వ్యాఖ్యలు..
కాగా అక్రమవలసదారులపై ట్రంప్ మొదట్నుంచీ కఠినంగానే వ్యవహరిస్తున్నారు. ఆయన పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత అక్రమ వలసదారుల గుర్తింపు, తరలింపు ప్రక్రియను వేగవంతం చేశారు. తొలుత 538మందిని అరెస్టు చేసి ఆయా దేశాలకు తరలించారు. ఇక ఎల్ పాసూ, టెక్సాస్, శాన్ డియాగో, కాలిఫోర్నియాలో ఉన్న 5వేల మందిని అక్రమ వలసదారులను ఆయా దేశాలకు తరలించేందుకు పెంటాగన్ రెడీ అయ్యింది. ఇప్పటికే గటేమాలా, పెరు, హోండూరస్ తదితర దేశాలకు అమెరికా విమానాల్లో పలువురు వలసదారులను తరలించింది. ఒక్కొక్క వలసదారుడిని తరలించేందుకు అమెరికాకు భారీ ఖర్చు అవుతున్నట్లు సమాచారం. గత వారం గటెమాలకు తరలించిన ఒక్కో వ్యక్తిపై అగ్రరాజ్యం సుమారు 4,675 డాలర్లను ఖర్చు పెట్టినట్లు సమాచారం.
Also Read: Gold Rate Today: పసిడిని పట్టుకోలేమా? అందనంత ఎత్తుకు బంగారం..తులం 86వేలు..త్వరలోనే లక్ష ఖాయం
అక్రమ వలసదారులపై అమెరికా అనుసరిస్తున్న విధానాల పట్ల ఇప్పటికే ఇండియా తన స్పందనను వెల్లడించింది. అక్రమ వలసలకు తాము వ్యతిరేకమని ఈ అంశం అనేక వ్యవస్థీక్రుత నేరాలతో ముడిపడి ఉందని పేర్కొంది. వీసాగడువు ముగిసినా లేదా సరైన దస్త్రాలు లేకుండా భారతీయులు అమెరికాతో సహా ఎక్కడ ఉన్నా వారిని తిరిగి తీసుకువచ్చేందుకు వీలు కల్పిస్తామని భారత విదేశాంగశాఖ స్పష్టం చేసింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter