Multibagger Penny Stock : ఒక్కసారిగా పెరిగిన స్టాక్స్‌.. ఏడాదిలో అద్భుతం జరిగిందిగా... లక్ష పెట్టుబడి పెడితే ఎంత వస్తుందంటే?

Multibagger Penny Stock: బారత స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం సెషన్లో పడిపోతున్నాయి. స్టాక్ మార్కెట్ పడిపోతున్నా..కొన్ని స్టాక్స్ మాత్రం భారీగా పెరుగుతున్నాయి. ఇంకొన్ని పడిపోతూ వస్తున్నాయి. స్టాక్ మార్కెట్లు పడిపోతున్నా..ఒక మల్టీబ్యాగర్ పెన్నీ స్టాక్ లాభాల్లోనే ఉంది. దాని గురించి తెలుసుకుందాం.   

Written by - Bhoomi | Last Updated : Feb 3, 2025, 06:19 PM IST
Multibagger Penny Stock : ఒక్కసారిగా పెరిగిన స్టాక్స్‌.. ఏడాదిలో అద్భుతం జరిగిందిగా... లక్ష పెట్టుబడి పెడితే ఎంత వస్తుందంటే?

Multibagger Penny Stock: స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారికి ఏ స్టాక్ ఎప్పుడు పెరుగుతుందో తగ్గుతుందో తెలియాలి. అంటే దీనిని ఊహించడం కష్టమే అయినప్పటికీ..మార్కెట్లను జాగ్రత్తగా గమనిస్తూ ఒక క్రమ పద్ధతిలో ఇన్వెస్ట్ చేసినట్లయితే మంచి లాభాలను అందుకోవచ్చు. దీనికోసం ఆయా కంపెనీల పనితీరు, ఫలితాలు, ప్రకటనలు, పెట్టుబడి వ్యూహాలు,  ప్రణాళికలు వీటన్నింటిని తెలుసుకుంటే సరైన సమయంలో సరైన స్టాక్స్ నిపుణుల సహాయంతో పెట్టుబడి పెట్టాలి. మంచి లాభాలు అంది ఛాన్స్ ఉంటుంది. అయితే కొన్ని స్టాక్స్ తక్కువ కాలంలో మంచి లాభాలు అందించేటువంటివి చాలా ఉన్నాయి.అయితే ఏ స్టాక్ నుంచి ఎప్పుడు వైదొలగాలి అనేది కూడా తెలుసుకొని ఉండాలి. భారీగా పెరిగిన స్టాక్ మళ్ళీ ఒక్కసారిగా పడిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.  

ఇప్పుడు ఇలాగే కేవలం ఏడాది వ్యవధిలోని అద్భుతమైన రిటర్న్స్ అందించిన ఒక స్టార్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అదే శ్రీ అధికారి బ్రదర్స్ నెట్వర్క్ లిమిటెడ్. ఇది ప్రముఖ ఎస్ ఏ బి టెలివిజన్ బ్రాండ్ ఫౌండర్. అయితే ఈ కంపెనీ స్టాక్ ఇన్వెస్టర్లకు గత ఏడాది కాలంలో కాసుల పంట పండించింది. దీంతో పెట్టుబడి దారులు పండగ చేసుకుంటున్నారు. 

Also Read: Baby Born: 'కలయిక' లేకుండానే సంతానం .. పిల్లలను కనాలంటే ఇకపై మహిళలు అవసరం లేదు

 2024 జనవరి 23న చూస్తే ఈ స్టాక్ ధర కేవలం 3.75 వద్ద ఉండేది. ఇప్పుడు 2025 ఫిబ్రవరి 1న చూసినట్లయితే 390.65 స్థాయికి చేరింది. అంటే ఈ క్రమంలో మల్టీ బ్యాగర్ రిటర్న్ అందింది అన్నమాట. ఏడాది కిందట జనవరి 23న ఇందులో లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే వారికి ఇప్పుడు 1. 04 కోట్లు వచ్చేవి. 

Also Read: West bengal: భర్త కిడ్నీ అమ్మి ప్రియుడితో జంప్ ఘటన.. వెలుగులోకి వస్తున్న నరాలు తెగే వాస్తవాలు...?..

అయితే ఈ స్టాక్ లోయర్ సర్క్యూట్లు కొడుతూ వస్తుంది. బడ్జెట్ స్టేషన్కు ముందు కూడా రూ. 400 లెవెల్స్ పైన ఉండగా.. అక్కడి నుంచి లోయర్ సర్క్యూట్స్ కొట్టింది. స్టాక్ మార్కెట్లో ఉన్న డేటా ప్రకారం చూస్తే ఈ స్టాక్ గతేడాది డిసెంబర్ 12వ తేదీన రూ. 2,197.70వద్ద 52వారాల గరిష్ట విలువ అదే విధంగా 2024 ఏప్రిల్ 2న 41.57 వద్ద కనిష్ట అని నమోదు చేసింది. ఇక ఫిబ్రవరి మార్కెట్ క్లోజింగ్ సమయానికి ఈ కంపెనీ మార్కెట్ విలువ 981. 43 కోట్లుగా ఉంది. ఈ కంపెనీ మల్టీబ్యాగర్ రిటర్న్స్ అందించినప్పటికీ.. గత కొంత కాలంలో చూస్తే  మాత్రం పడిపోతూ వస్తుంది. అయినప్పటికీ గత ఏడాది జనవరిలో పెట్టుబడి చేసిన వారికి ఇప్పటికి భారీగానే లాభాలు వచ్చాయి. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News