YS Jagan: 'ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా నేనే 30 సంవత్సరాలు ఉంటా!'

Again I Will Become Chief Minister Says Ex CM YS Jagan: అధికారంలో ఉన్నప్పుడు పార్టీ శ్రేణులను పట్టించుకోలేదని.. ఈసారి తనలోని మరో జగన్‌ను చూస్తారని.. మళ్లీ అధికారంలోకి రావడం పక్కా అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రకంటించారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Feb 5, 2025, 07:07 PM IST
YS Jagan: 'ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా నేనే 30 సంవత్సరాలు ఉంటా!'

Once Again Jagan CM: అధికారం కోల్పోవడంతో కష్టాలు వస్తాయి. వాటిని ఎదుర్కొని గట్టిగా నిలబడితే మనదే విజయం. రెట్టింపు ఉత్సాహంతో ముందుకు వచ్చి 30 సంవత్సరాల పాటు మనమే ఉంటాం' అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రకటించారు. ఈసారి జగన్‌ 2.0ని చూస్తారని.. ఇది వేరే లెవల్లో ఉంటుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎవరూ కూడా వైఎస్సార్‌సీపీ కార్యకర్త వెంట్రుక కూడా పీకలేరని స్పష్టం చేశారు. జగన్‌ వ్యాఖ్యలతో ఆ పార్టీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం ఏర్పడింది.

Also Read: Delhi Exit Poll 2025: ఢిల్లీ మరోసారి ఆమ్‌ఆద్మీ పార్టీదే!.. ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాల సరళి ఇదే

తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం విజయవాడ కార్పొరేటర్లు, నాయకులతో ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ పరిస్థితులు.. రాజకీయ పరిణామాలపై వారితో చర్చించిన అనంతరం వైఎస్‌ జగన్‌ కీలక ప్రసంగం చేశారు. ఈ సమావేశంలో కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసి రాజకీయాలను వేడెక్కించారు. పార్టీ శ్రేణులను ఉత్సాహాపరుస్తూ చేసిన ప్రసంగం ఆ పార్టీలో జోష్‌ వచ్చింది.

Also Read: Delhi Exit Polls: బీజేపీకి జై కొట్టిన ఢిల్లీ ఓటర్లు.. ఢిల్లీలో 27 ఏళ్ల తర్వాత కమల వికాసం?

'ఈ సారి జగన్‌ 2.Oని చూడబోతున్నారు. 2.O వేరేగా ఉంటుంది. కార్యకర్తల కోసం జగన్‌ ఏం చేస్తాడో చూపిస్తా. గతంలో కార్యకర్తలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వలేకపోయా. కార్యకర్తలను ఇబ్బంది పెట్టినవారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అక్రమ కేసులు పెట్టినవారిపై ప్రైవేట్‌ కేసులు వేస్తా. చట్టం ముందు నిలబెడతాం' అని మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. '30 సంవత్సరాలు అధికారంలో ఉంటాం. ఎవడు కూడా వైఎస్సార్‌సీపీ కార్యకర్త వెంట్రుక కూడా పీకలేరు' అని శ్రేణులకు పూర్తి భరోసానిచ్చారు.

ప్రతిపక్షంలో ఉండడంతో భయపడుతున్న పార్టీ కార్యకర్తలు, నాయకులకు వైఎస్‌ జగన్‌ ధైర్యం ఇచ్చారు. 'ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టాలు వస్తాయి. ఆ కష్టాలను ఎదుర్కొన్నప్పుడే నాయకుడిగా ఎదుగుతాం. ఎవరికీ ఏ కష్టం వచ్చినా నా కథ గుర్తుకు తెచ్చుకోండి. నన్ను 16 నెలలు జైలులో పెట్టలేదా? ఏమైంది? బయటకు రాలేదా.. ముఖ్యమంత్రి అవ్వలేదా' అని వైఎస్ జగన్ కార్యకర్తలకు ధైర్యం నూరి పోశారు. 'రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉండాలి. త్వరలోనే జమిలి ఎన్నికలు అంటున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అఖండ మెజార్టీతో వైఎస్సార్‌సీపీ గెలుస్తుంది' అని జోష్యం చెప్పారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News