Bandaru supritha emotional post on kp chowdary death: ఫెమస్ నిర్మాత గోవాలో ఆత్మహత్య చేసుకుని మరీ మరణించారు. ఆయన కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఆయన సూపర్ స్టార్ రజనీ కాంత్ మూవీ కబాలినీ తెలుగులో నిర్మించారు. ఇదిలా ఉండగా.. గతంలో కేపీ చౌదరీని డ్రగ్స్ కేసులో నిందితుడిగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒక వైపు ఆర్థిక ఇబ్బందులు, మరోవైపు డ్రగ్స్ ఆరోపణలతో ఆయన తీవ్రంగా ఒత్తిడి గురై.. ఈ విధంగా అఘాయిత్యానికి పాల్పడ్డారు.
గతంలో ఆయన గోవా నుంచి మాదక ద్రవ్యాలను తరలిస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. గోవా నుంచి 100 ప్యాకెట్ల కొకైన్ తీసుకు రాగా.. 90 ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరో 10 ప్యాకెట్లు ఎవరికి అమ్మారన్న విషయంపై పోలీసుల విచారణ చేశారు. ఈ క్రమంలో కేపీ చౌదరీ మరణం పట్ల సురేఖ వాణి కూతురు సుప్రీత ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
కేపీ చౌదరితో కలిసి దిగిన ఫోటో షేర్ చేసి .. మిమ్మల్ని మిస్ కావడం చాలా బాధగా ఉందని రాసుకొచ్చారు. అన్న అంటూ సంభోదిస్తు.. తన బాధల్ని ఎవరికి చెప్పుకొవాలని, తిరిగి వెనక్కు వచ్చేయ్ అంటూ.. మిస్ యూ కేపీ అన్న అంటూ ఎమోషనల్ అయ్యారు.
Read more: Keerthy Suresh: ఓటీటీలోకి కీర్తిసురేష్ బోల్డ్ మూవీ.. టీజర్ తో గత్తర రేపుతున్న మహానటి..
నువ్వు ఎక్కడున్నా టైగర్ ఏ అంటావుగా, ఐ లవ్ యు సో మచ్ అన్న. రెస్ట్ ఇన్ పీస్ అంటూ సుప్రీత భావోద్వేగానికి గురయ్యారు. ప్రస్తుతం సుప్రీత చేసిన ఇన్ స్టా పోస్ట్ వైరల్ గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter