Keerthy Suresh: పెళ్లైన రెండు నెలలకే భర్తకు షాకిచ్చిన కీర్తిసురేష్.. మహానటిని తిట్టిపోస్తున్న నెటిజన్లు.. మ్యాటర్ ఏంటంటే..?

Keerthy Suresh: కీర్తిసురేష్ ఇటీవల ఫోటోషూట్ లతో బిజీగా ఉంటున్నారు.తాజాగా అక్క మూవీ టీజర్ విడుదల చేశారు. దీనిలో కీర్తిసురేష్ మాస్ లుక్ లో అదరగొడుతుంది.
 

1 /6

కీర్తిసురేష్ గతేడాది చివరల్లో తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోనీ తట్టిల్ ను ప్రేమించి మరీ పెళ్లి చేసుకుంది. వీరి పెళ్లి గోవాలో హిందు, క్రిస్టియన్ సాంప్రదాయాల్లో జరిగింది.   

2 /6

పెళ్లైన రెండురోజులకు కీర్తిసురేష్ బేబీజాన్ మూవీ ప్రమోషన్ లలో పాల్గొంది.  ఈ సినిమాతో మహానటి బాలీవుడ్ లో ఎంట్రీఇచ్చింది. అయితే.. ఈ మూవీ అనుకున్నంత మేరకు హిట్ ను సొంతం చేసుకొలేదు.

3 /6

కానీ మహానటి మాత్రం.. ఎక్కడికి వెళ్లిన మాడ్రన్ దుస్తుల్లో మంగళసూత్రం వేసుకుని వెళ్లారు. అప్పట్లో కీర్తిసురేష్ మంగళ సూత్రం వేసుకొని ప్రమోషన్ లలో పాల్గొనడం పెద్ద చర్చకు దారితీసింది.

4 /6

న్యూఇయర్, సంక్రాంతి సెలబ్రేషన్ లను కీర్తిసురేష్ తన భర్తతో కలిసి గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే..పెళ్లి తర్వాతకూడా తనదే డామినేషన్ అంటూ మహానటి ఇటీవల చెప్పారు. ఆంటోనీ తట్టిల్ కు మోహమాటం ఎక్కువని, ఫోటోలు దిగడంతో అంతగా ఆసక్తి చూపించడని కీర్తిసురేష్ చెప్పారు.

5 /6

తాజాగా.. ఒక ఫోటోషూట్ లో కీర్తిసురేష్ మంగళ సూత్రం లేకుండానే ఫోటోషూట్ లో పాల్గొన్నారు. అదే విధంగా అక్క టీజర్ లో కూడా కీర్తి సురేష్ మంగళ సూత్రం లేకుండానే కన్పించారు. దీంతో అభిమానులు కీర్తిసురేష్ నిర్వాకానికి ఫైర్ అవుతున్నారు.  

6 /6

పెళ్లై రెండు నెలలు కూడా కాక ముందే ఇదేం పని అని మండిపడుతున్నారు. గతంలో పసుపు తాడుతో కన్పిస్తే..అందరు ప్రశంసలు కురిపించారు. కానీ ఇప్పుడు ఈ ఫోటో షూట్ పై మాత్రం నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. అసలు పసుపుతాడు, మంగళసూత్రం లేకుండా ఎలా ఉంటారని కొంతమంది మండిపడుతున్నారు. మొత్తానికి కీర్తిసురేష్ మరోసారి వార్తలలో నిలిచింది.