Weight Loss Tips: ఆధునిక జీవన విధానంలో వివిధ రకాల ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి కారణంగా అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతున్నాయి. స్థూలకాయం లేదా అధిక బరువు ఈ సమస్యల్లో అతి ముఖ్యమైంది. మరి బరువు నియంత్రించుకోవాలంటే ఏం చేయాలి, ఎలాంటి సూచనలు పాటించాలో తెలుసుకుందాం.
డైట్లో కార్బోహైడ్రేట్లు, ఫ్యాట్, షుగర్ తక్కువగా తీసుకోవాలి. లేకపోతే బరువు పెరుగుతుంది. డైట్లో ఫైబర్ ఎక్కువగా ఉండాలి
అంతేకాకుండా రోజూ అవుట్డోర్ వ్యాయామం తప్పకుండా ఉండాలి. అంటే సైక్లింగ్, రన్నింగ్ లేదా వాకింగ్ తప్పకుండా చేయాలి
ఎప్పుడూ భోజనం చేసిన వెంటనే పడుకోకూడదు. రోజూ 8 గంటల నిద్ర తప్పకుండా ఉండాలి. రాత్రి భోజనం సాయంత్రమే ఫినిష్ చేయాలి. రాత్రి త్వరగా పడుకుని త్వరగా లేవాలి
బరువు నియంత్రణకు ముందుగా మీరు చేయాల్సింది తిండి, నిద్ర అలవాట్లను సెట్ చేసుకోవాలి. తినడానికి, నిద్రించడానికి మధ్యలో కనీసం 2-3 గంటలు విరామం ఉండాలి
స్థూలకాయానికి ప్రధాన కారణం అనారోగ్యకరమైన ఫుడ్స్, చెడు జీవనశైలి. అర్ధరాత్రి వరకు నిద్రపోకుండా ఉండటం, ఉదయం ఆలస్యంగా నిద్ర లేవడం, భోజనం చేసిన వెంటనే పడుకోవడం వంటి అలవాట్లు ఆరోగ్యంపై ముఖ్యంగా శరీరంపై ప్రతికూల ప్రభావం పడుతుంది
బరువు నియంత్రణ సమయంలో కండరాలు బలహీనం కాకుండా చూసుకోవాలి. డైట్లో ప్రోటీన్ ఎక్కువగా ఉండాలి. శరీరం ఎదుగుదలకు దోహదమౌతుంది
ఫైబర్ అనేది జీర్ణక్రియను బలోపేతం చేస్తుంది. మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం అందిస్తుంది. దీనివల్ల దీర్ఘకాలం కడుపు నిండుగా ఉన్నట్టు ఉంటుంది. త్వరగా ఆకలేయదు.