Game Changer Ott Streaming Date: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గేమ్ ఛేంజర్’. దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి పండగ నేపథ్యంలో మొదటగా విడుదలైంది. మంచి సబ్జెక్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా స్క్రీన్ ప్లే లోపాల కారణంగా బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేదు. ఇప్పటికే థియేట్రికల్ రన్ ముగిసిన ఈ సినిమా తాజాగా ఓటీటీ రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. దానికి సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల చేశారు.
Game Changer Ott Streaming Date: 2025 సంక్రాంతి కానుకగా విడుదలైన రామ్ చరణ్ తాజా చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ మూవీలో రామ్ చరణ్ ఐపీఎస్ ఆఫీసర్ నుంచి ఐఎఎస్ ఆఫీసర్ అయిన రామ్ నందన్ పాత్రతోపాటు ఆయన తండ్రి అయిన రాజకీయ నాయకుడైన అప్పన్నగా తండ్రీ కొడుకులుగా నటించి మెప్పించారు.
శంకర్ ‘గేమ్ ఛేంజర్’ మూవీని మాజీ ఎలక్షన్ కమిషనర్ టీఎన్ శేషన్ ను ప్రేరణగా తీసుకొని తెరకెక్కించినట్టు చెప్పారు. ఎపుడో 90 వ దశకంలో రావాల్సిన ఈ సినిమాను ఈ జనరేషన్ లో స్క్రీన్ ప్లే లోపాలతో తెరకెక్కించాడు. ఇప్పటి జనరేషన్ కు ఇప్పటి కాలానికి తగ్గట్టు తెరపై సరైన విధంగా ఎక్స్ క్యూట్ చేయలేకపోయాడనే విమర్శలు ఎదుర్కొన్నాడు.
మొత్తంగా 'గేమ్ చేంజర్' ఈ యేడాది బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లలో ఒకటిగా నిలిచింది. దీని పలు కుట్రలు కూడా తెర వెనక పనిచేసినట్టు తెలుస్తోంది. ‘గేమ్ చేంజర్’ లో కంటెంట్ బాగున్నా.. స్క్రీన్ ప్లే లోపాల కారణంగా కూడా ఈ సినిమా అనుకున్న ఫలితాన్ని రాబట్టలేకపోయింది. పైగా మూవీ రిలీజై రోజే.. పైరసీ బారిన పడటం కూడా ఈ సినిమాకు కోలుకోలేని దెబ్బ తీసింది.
మొత్తంగా ఈ ‘గేమ్ చేంజర్’ రామ్ చరణ్ కెరీర్ లో అతిపెద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రూ. 111 కోట్ల షేర్ (రూ. 200 కోట్ల గ్రాస్)వసూళు చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. రూ. 223 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలో దిగిన ఈ సినిమా థియేట్రికల్ గా రూ. 100 కోట్లకు పైగా నష్టాలను మిగుల్చినట్టు సమాచారం.
ఇప్పటికే థియేట్రికల్ రన్ ముగిసిన ఈ సినిమా తాజాగా ఓటీటీ రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. ఈ సినిమా ఫిబ్రవరి 7న మూడు భాషల్లోఅమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు రానుంది. దీనికి సంబంధించి అఫీషియల్ గా ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. మొత్తంగా థియేట్రికల్ గా ఈ చిత్రాన్ని చూడని వారు అయిన వారు అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడొచ్చు.