Royal Enfield Classic 350 At Rs.22,000: రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 మోటర్‌సైకిల్‌పై అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్ లభిస్తున్నాయి. కేవలం రూ.22,000 డౌన్ పేమెంట్ చెల్లించి.. బైక్‌ను మీ సొంతం చేసుకోవచ్చు. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Royal Enfield Classic 350 At Rs.22,000: ప్రముఖ మోటర్ సైకిల్ కంపెనీ రాయల్ ఎన్‌ఫీల్డ్‌కి మార్కెట్లో అద్భుతమైన డిమాండ్ ఉంది. ఈ కంపెనీ విడుదల చేసే ప్రతి మోటర్ సైకిల్‌కి మార్కెట్లో మంచి గుర్తింపు ఉంది. మీరు కూడా ఎప్పటి నుంచో మంచి రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 మోటర్ సైకిల్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇదే అద్భుతమైన అవకాశంగా భావించవచ్చు. అతి తక్కువ డౌన్ పేమెంట్ చెల్లించి పొందవచ్చు. అయితే ఇది కేవలం పరిమితకాల ఆఫర్ మాత్రమే.. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 మోటర్‌సైకిల్‌ను కేవలం రూ.22,000 డౌన్ పేమెంట్ చెల్లింపు సొంతం చేసుకోవచ్చు. ఈ మోటర్‌సైకిల్ అస్సలు ధర రూ. 1.75 లక్షలు (ఎక్స్-షోరూమ్) కాగా ప్రత్యేకమైన ఆఫర్స్‌లో భాగంగా అతి తక్కువ డౌన్ పేమెంట్ కట్టి పొందవచ్చు.
ఈ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 మోటర్‌సైకిల్‌పై అతి తక్కువ వడ్డీ రుణంతో అందిస్తోంది. మూడు సంవత్సరాల పాటు దీనిని EMIలో కొనుగోలు చేస్తే 9.7% వడ్డీ రేటుతో రూ. 6,455 నెలవారీ EMI చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇతర ప్రత్యేకమైన ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
ఇక రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్‌కి సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళితే.. ఈ బైక్ ఎంతో శక్తివంతమైన 349 సిసి సింగిల్-సిలిండర్ లిక్విడ్-కూల్డ్ ఇంజన్‌తో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా అద్భుతమైన డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌తో పాటు అనేక రకాల కొత్త ఫీచర్స్‌తో అందుబాటులో ఉంది..
ఇక రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ ఈ బైక్‌లో ప్రత్యేకమైన డిజిటల్ స్పీడోమీటర్‌ను అందిస్తోంది. ఇక దీని ఇంజన్ గరిష్టంగా 27 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇటీవలే మార్కెట్లోకి విడుదలై క్లాసిక్ 350 మోటర్‌సైకిల్ దాదాపు 45 కి.మీ మైలేజీని అందిస్తుంది.
అంతేకాకుండా త్వరలోనే రాయల్ ఎన్ఫీల్డ్ ప్రత్యేకమైన మోటర్‌సైకిల్ కూడా విడుదల కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అది కూడా.. క్లాసిక్ 350లోనే అద్భుతమైన వేరియంట్ అందుబాటులోకి రానుంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే కంపెనీ వెల్లడించనుంది.
నోట్: ఈ స్టోరీలోని డౌన్ పేమెంట్ ప్రదేశాలతో పాటు డీలర్, మోడల్ వేరియంట్‌పై ఆధార పడి ఉంటుంది. ఇందులో కొన్ని ప్రదేశాలకు సంబంధించిన ధరలను ఆధారంగా తీసుకు మాత్రమే ఈ స్టోరీని రాయడం జరిగింది.