nara ram mohan naidu protocol controversy: ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి సర్కారు పాలన కొనసాగుతుంది. ముఖ్య మంత్రి చంద్రబాబు ప్రజలకు ఎన్నికలలో ఇచ్చిన హమీలను నెరవేరుస్తునే, మరోవైపు గత సర్కారు చేసిన తప్పిదాలను సైతం ప్రజల ముందు ఉంచుతున్నారు. ఈ క్రమంలో ఏపీలో టీడీపీ వర్సెస్ వైఎస్సార్సీపీల మధ్య తగ్గాఫార్ వార్ నడుస్తుందని చెప్పుకొవచ్చు.
ఈక్రమంలో ప్రస్తుతం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఇటీవల రథ సప్తమి వేళ అరసవెల్లికి వెళ్లారు. అక్కడ రథ సప్తమిరోజు నేరుగా సూర్యకిరణాలు స్వామివారి మూల విరాట్ ను తాకుతాయి. ఈ అరుదైన సుందర మూర్తీని చూసేందుకు భక్తులు తండోప తండాలుగా వస్తుంటారు. అయితే.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సూర్యనారాయణుడి దర్శనం కోసం వెళ్లారు. అక్కడి వరకు బాగానే ఉంది.
కానీ ఆయన తనతో పాటుగా సింగర్ మంగ్లీని తీసుకెళ్లడం రచ్చగా మారింది. సింగర్ మంగ్లీ వైసీపీ హాయాంలో టీటీడీలో సలహాదారు పదవిలో ఉంది. అంతేకాకుండా.. గతంలో వైఎస్ జగన్ కు అత్యంత సన్నిహితంగా ఉండేది. గతంలో టీడీపీ వాళ్లు చంద్రబాబు ప్రచారం కోసం పాటలు పాడమని కోరారంట. దీనిపై నిర్మోహమాటంగా మంగ్లీ పాడనని ముఖం మీద చెప్పింది.
అయితే.. అలాంటి వ్యక్తిని తీసుకుని కేంద్ర మంత్రి అరసవెల్లిలో ప్రోటోకాల్ దర్శనం కల్పించడం ఎంత వరకు కరెక్ట్ అని టీడీపీ క్యాడర్ మండిపడుతున్నారు. గతంలో ఆమె పలు సందర్భాలలో చంద్రబాబు గురించి తప్పుగా మాట్లాడారని కూడా టీడీపీ నేతలు గుర్రుగా ఉన్నారు.
Read more: Tirumala: టీటీడీ సంచలన నిర్ణయం.. తొలి విడతగా 18 మంది ఉద్యోగుల బదిలీ.. కారణం ఏంటంటే..?
అలాంటి వ్యక్తిని తీసుకుని, కోట్లాది మంది భక్తులు స్వామి వారి దర్శనం కోసం క్యూలైనట్లులో పడిగాపులు కాస్తుంటే.. ఆమెకు వీవీఐపీ ప్రోటోకాల్ లో తీసుకెళ్లి స్వామి వారి దర్శనం అయ్యేలా చేయడంపై టీడీపీ శ్రేణులు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిపై విమర్శలు గుప్పిస్తున్నారు. మొత్తానికి సింగర్ మంగ్లీ అరసవెల్లికి వెళ్లి వీవీఐపీ ప్రొటోకాల్ తో దర్శనం చేసుకొవడం పెద్ద దుమారానికి కారణమైందని చెప్పుకొవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter