YSR Congress Party: అధికారం కోల్పోయిన తర్వాత తొలిసారిగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి శుభ పరిణామం చోటుచేసుకోనుంది. వైఎస్సార్ సీపీ కార్యాలయం మూత పడనుందని ప్రచారం జరుగుతున్న తరుణంలో ఆ పార్టీకి భారీ ఊరట లభించనుంది. కాగా ఈ పరిణామంతో జగన్ సోదరి వైఎస్ షర్మిలకు భారీ ఎదురుదెబ్బ ఎదురు కావడం గమనార్హం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి ఏపీలో కీలక నాయకుడు చేరనున్నాడు.
Also Read: Employees PRC: ఉద్యోగులకు పీఆర్సీ, ఒకటో తారీఖున జీతాలు ఎక్కడ?: వైఎస్ జగన్
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో మాజీ మంత్రి సాకే శైలజా నాథ్ చేరనున్నాడు. ఆయన చేరికకు రేపు శుక్రవారం ముహూర్తం కుదిరింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా పని చేసిన శైలజానాథ్ విభజన అనంతరం కూడా ఆ పార్టీలోనే కొనసాగారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ (ఏపీసీసీ) అధ్యక్షుడిగా శైలజానాథ్ బాధ్యతలు చేపట్టారు. షర్మిల పార్టీలో చేరాక ఆమెకు అధ్యక్ష బాధ్యతలు అప్పగించినప్పటి నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉన్నారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆయన ఎట్టకేలకు కాంగ్రెస్‌ను వీడాలని నిర్ణయించారు.
Also Read: YS Jagan: 'ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నేనే 30 సంవత్సరాలు ఉంటా!'
తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో శైలజానాథ్ వైసీపీ కండువా కప్పుకోనున్నారు. అతడి చేరికతో వైసీపీకి భారీ బలం లభించనుంది. పార్టీని నాయకులు వీడుతున్న సమయంలో శైలజానాథ్ చేరిక వైఎస్సార్సీపీకి జోష్‌నివ్వనుంది. గతంలో ఓ వివాహ వేడుకకు హాజరైన సమయంలో జగన్‌తో శైలజానాథ్ మాట్లాడుకున్నారు. అప్పటి నుంచి ఆయన వైసీపీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. దీనికితోడు జగన్ తండ్రి వైఎస్సార్‌తో కలిసి శైలజానాథ్ పని చేశారు. ఆయన రాజకీయ జీవితం కాంగ్రెస్‌తోనే మొదలవగా.. కాంగ్రెస్‌తో సంబంధం ఉన్న వైఎస్సార్సీపీతో చేరడం గమనార్హం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.