Delhi Exit Polls: ఎగ్జిట్ పోల్స్ లెక్క తప్పనుందా, గత మూడు ఎన్నికల్లో ఏం జరిగింది

Delhi Exit Polls: దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఎగ్జిట్ పోల్స్‌పై విభిన్న అభిప్రాయాలు వ్యక్తమౌతుంటాయి. ఎగ్టిట్ పోల్ట్ ఎగ్టాట్ పోల్స్ కావనే వాదన వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఎగ్జిట్ పోల్స్ నిజమైతే, మరి కొన్ని సందర్భాల్లో తప్పయిన పరిస్థితి ఉంది. మరి ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్ పరిస్థితి ఏంటి, గతంలో ఏం జరిగింది పూర్తి వివరాలు మీ కోసం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 6, 2025, 04:29 PM IST
Delhi Exit Polls: ఎగ్జిట్ పోల్స్ లెక్క తప్పనుందా, గత మూడు ఎన్నికల్లో ఏం జరిగింది

Delhi Exit Polls: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ నెల 8వ తేదీన వెల్లడి కానున్నాయి. ఈలోగా నిన్న సాయంత్రం విడుదలైన ఎగ్జిట్ పోల్స్‌‌ దాదాపు అన్ని సంస్థలు ఈసారి అధికారం బీజేపీదే అంటున్నాయి. కేకే సర్వే, పొలిటికల్ క్రిటిక్ మాత్రమే ఆప్ మరోసారి అధికారంలో వస్తుందని చెప్పాయి. ఈ క్రమంలో వాస్తవ పరిస్థితి ఏంటి, గతంలో ఏం జరిగిందనేది తెలుసుకుందాం.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ అన్నీ బీజేపీకే పట్టం కడుతున్నాయి. కానీ ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మాత్రం ఖండిస్తున్నారు. తాము కచ్చితంగా అధికారంలో వస్తామంటున్నారు. డిల్లీలో ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడూ నిజం కాలేదంటున్నారు. అరవింద్ కేజ్రీవాల్ రాజకీయంగా ఈ ఆరోపణల చేసుండవచ్చు. కానీ నిజం మాత్రం అదే. ఢిల్లీలో ఆప్ గెలిచే సీట్లపై మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ లెక్కలు ప్రతి సారీ తప్పయ్యాయి. గత మూడు పర్యాయాలు అదే జరిగింది. 2013, 2015, 2020 మూడు ఎన్నికల్లోనూ ఎగ్జిట్ పోల్స్ బీజేపీకే అనుకూలంగా ఫలితాలు ఇచ్చాయి. ఆ గణాంకాలు ఓసారి చూద్దాం.

గత మూడు ఎన్నికల్లో ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నాయంటే

2013 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో హెడ్‌లైన్స్ టుడే ఎగ్జిట్ పోల్స్‌లో బీజేపీకు 41, కాంగ్రెస్‌కు 20, ఆప్ పార్టీకు 6 సీట్లు వస్తాయని తేలింది. ఇక ఏబీపీ నీల్సన్ ఎగ్జిట్ పోల్స్‌లో బీజేపీకు 37, ఆప్ పార్టీకు 15, కాంగ్రెస్ పార్టీకు 16 సీట్లు వస్తాయని వెల్లడైంది. సీ వోటర్ కూడా బీజేపీ 31 స్థానాలు, కాంగ్రెస్ 20 స్థానాలు, ఆప్ పార్టీ 15 స్థానాలు గెల్చుకుంటుందని చెప్పింది. టుడేస్ చాణక్య మాత్రం ఆప్ 31 స్థానాలు, కాంగ్రెస్ 19 స్థానాలు, బీజేపీ 29 స్థానాలు గెల్చుకుంటుందని తెలిపింది. కానీ అందుకు భిన్నంగా జరిగింది. ఆప్ పార్టీ 28, కాంగ్రెస్ 8 స్థానాలు గెల్చుకుని అధికారంలో వస్తే బీజేపీ 32కు పరిమితమైంది. 

ఇక 2015 ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్‌లో న్యూస్ నేషన్, ఇండియా టుడే, ఇండియా టీవీ సీ ఓటర్, యాక్సెస్ మై ఇండియా, టుడేస్ చాణక్య, ఏబీపీ నీల్సన్ సంస్థలు ఆప్ పార్టీకు మెజార్టీ సీట్లు వస్తాయని చెప్పినా బీజేపీ విషయంలో లెక్కలు తప్పాయి. బీజేపీకు దాదాపు అన్ని సంస్థలు 20-30 సీట్ల మధ్యలో కచ్చితంగా వస్తాయని చెప్పాయి. అంటే సరాసరి బీజేపీకు వచ్చే సీట్లు 24 అని అన్ని సంస్థలు తేల్చాయి. కానీ వాస్తవం అందుకు భిన్నంగా వచ్చింది. ఈ ఎన్నికల్లో ఆప్ పార్టీ 67 స్థానాలతో భారీ విజయం సాధించగా బీజేపీ కేవలం 3 స్థానాలకు పరిమితమైంది. 

2020 ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్‌లో కూడా లెక్కలు తప్పాయి. ఈ ఎన్నికల్లో ఇండియా టుడే యాక్సెస్ మై ఇండియా, న్యూస్ ఎక్స్ పోల్‌స్ట్రాట్, ఏబీపీ న్యూస్ సీ వోటర్, రిపబ్లిక్ టీవ జన్ కీ బాత్, టైమ్స్ నౌ సంస్థలు అన్నీఆప్ పార్టీకు సరాసరిన 54 స్థానాలు వస్తాయిని బీజేపీకు 15 స్థానాలు లభిస్తాయని చెప్పాయి. కానీ ఈ ఎన్నికల్లో ఆప్ పార్టీకు 62 స్థానాలు లభిస్తే బీజేపీకు కేవలం 8 స్థానాలు దక్కాయి. 

అంటే గత మూడు పర్యాయాల్లో ఆప్ సామర్ధ్యాన్ని, ప్రజల్లో ఉన్న పట్టుని కచ్చితంగా అంచనా వేయలేకపోయాయి. ఈసారి కూడా అదే జరుగుతుందని ఆప్ నేతలు చెబుతున్నారు. ఆప్ పార్టీ విషయంలో సర్వే సంస్థలు ప్రతిసారీ తప్పే చెప్పాయని అరవింద్ కేజ్రీవాల్ అందుకే విమర్శిస్తున్నారు.

Also read: School Girl Gang Rape: టీచర్లు కాదు..కీచకులు, విద్యార్థినిపై గ్యాంగ్‌రేప్ ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News