Visakha Railway Zone: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన హామీల్లో కీలకమైంది విశాఖపట్నం ప్రత్యేక రైల్వే జోన్. విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటు కావల్సిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కొత్త రైల్వే జోన్ పరిధిని నిర్ణయిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయ నిర్మాణానికి ప్రధాని మోదీ ఇప్పటికే శంకుస్థాపన చేశారు. ఇప్పుడు కొత్తగా రైల్వే జోన్ పరిధి, ఇతర డివిజన్ల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. కొత్త నిర్ణయాల ప్రకారం వాల్తేర్ డివిజన్‌ను విశాఖ డివిజన్‌గా పేరు మారుస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. విశాఖ డివిజన్ పరిధి కూడా మార్చింది. దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలో ఇకపై విశాఖ, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లు ఉంటాయి. విశాఖ డివిజన్‌కు 410 కిలోమీటర్ల పరిధిని చేర్చింది రైల్వే శాఖ.
ఇక ఇప్పటి వరకు సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో ఉన్న కొండపల్లి-మోటుమర్రి సెక్షన్‌ను విజయవాడ డివిజన్‌కు మార్చింది. రాయగడ రైల్వే డివిజన్ పరిధి కూడా నిర్ణయమైంది. రైల్వే శాఖ కొత్త ఉత్తర్వుల ప్రకారం డివిజన్ల పని ప్రారంభమౌతుంది. వాల్తేర్ డివిజన్‌ను దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లో కలిపేందుకు ఇన్నాళ్లూ ఈస్ట్ కోస్ట్ రైల్వే అంగీకరించకపోవడం వల్ల ఇప్పటి వరకూ ప్రత్యేక రైల్వే జోన్ ఆలస్యమైంది. ఇప్పుడా అడ్డంకి తొలగడమే కాకుండా పరిధి నిర్ణయం కావడంతో ఇక పనులు ఊపందుకోనున్నాయి.
విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్ ఏర్పాటుతో ప్రయాణీకులకు మరింత మెరుగైన సౌకర్యాలు అందనున్నాయి. అంతేకాకుండా కొత్తగా ఉద్యోగావకాశాలు ఉత్పన్నమౌతాయి దేశవ్యాప్తంగా ఉన్న 17 జోన్ల జాబితాలో 18వ జోన్ చేరనుంది. అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాలు కూడా పెరగనున్నాయి.
Also read; 8th Pay Commission Salary Hike: ఉద్యోగుల జీతాలు ఎంత పెరుగుతున్నాయి. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఎంత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి