Delhi Election Results 2025: దేశ రాజధాని ఢిల్లీ ఎన్నికల్లో ఎక్కడా కాంగ్రెస్ గాలి వీచినట్లు కనిపించడం లేదు. హస్తం పార్టీకి అక్కడి ఓటర్లు వరుసగా నాల్గోసారి హాండ్ ఇచ్చారు. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో గుండు సున్నా తెచ్చుకున్న కాంగ్రెస్ పార్టీ.. ఈ సారి కూడా ఒక్కటంటే ఒక్క సీటు ఇవలేదు అక్కడ ఓటర్లు. వరుసగా మూడు సార్లు ఢిల్లీ శాసన సభలో సున్నా సీట్లతో హాట్రిక్ సాధించిన పార్టీగా కాంగ్రెస్ పార్టీ0 సరికొత్త చరిత్ర సృష్టించింది. వరుసగా మూడోసారి ఆ పార్టీకి ఢిల్లీ శాసనసభ స్థానంలో లేకుండా పోయింది.
ఒక విధంగా ఇది కాంగ్రెస్ పార్టీకి ఊహించని గట్టి ఎదురు దెబ్బగా చెప్పవచ్చు. మొత్తంగా మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో 99 స్థానాలు గెలిచి కేంద్రంలో తామే అధికారంలోకి వచ్చామన్న బిల్డప్ ఇచ్చిన హస్తం పార్టీకి ఢిల్లీ ఓటర్లు కర్రు కాల్చి వాత పెట్టారు. అంతేకాదు మొన్నటి హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో ఈ పార్టీకి అక్కడ ప్రజలు తిరస్కరించారు. ఏతావాతా జమ్ము కాశ్మీర్ తో పాటు ఝార్ఖండ్ లో అక్కడ ప్రాంతీయ పార్టీల పొత్తు కారణంగా కొన్ని సీట్లు గెలువగలిగింది. మొత్తంగా ఢిల్లీ ఎన్నికల్లో సత్తా చాటాలన్న కాంగ్రెస్ ఆశలు అడియాసలయ్యాయి. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామిలను ఓటర్లు నమ్మలేదనే విషయం ప్రూవ్ అయింది.
ఇదీ చదవండి: గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!
ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?
ఇప్పటి వరకు వచ్చిన ఫలితాల్లో కాంగ్రెస్‌కు 6 శాతం ఓట్లు కూడా దాటలేదు. ఇక బీజేపీ సుమారు 48 శాతం ఓట్లతో దూకుడును పదర్శిస్తోంది. ఆమ్ఆద్మీ పార్టీకి 43 శాతం ఓట్లు వచ్చాయి. ట్రెండ్స్ ఇలానే కొనసాగితే.. ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న 27 ఏళ్ల బీజేపీ కల నెరవేరనుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.