Nagarjuna: నరేంద్ర మోదీతో అక్కినేని నాగార్జున ఫ్యామిలీ భేటీ.. కారణం ఏంటంటే..?

PM Modi: నాగార్జున తన కుటుంబంతో కలిసి ఢిల్లీకి వెళ్లారు. అక్కడ పార్లమెంట్ భవనంలో నంద్యాల ఎంపీ శబరితో భేటీ అయ్యారు. ఆ తర్వాత ప్రధాని మోదీని కూడా కలిశారు.  

Written by - Inamdar Paresh | Last Updated : Feb 7, 2025, 03:44 PM IST
  • ఢిల్లీకి వెళ్లిన నాగార్జున ఫ్యామిలీ..
  • మోదీ తో మర్యాదపూర్వక భేటీ..
Nagarjuna: నరేంద్ర మోదీతో అక్కినేని నాగార్జున ఫ్యామిలీ భేటీ.. కారణం ఏంటంటే..?

Nagarjuna family meets with pm modi in delhi: హీరో నాగార్జున తన కుటుంబంతో కలసి ఢిల్లీలోకి పార్లమెంట్ హాల్ కు వెళ్లారు. తొలుత నంద్యాల ఎంపీ శబరిని మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. నాగార్జునతో పాటు... అక్కినేని అమల, నాగచైతన్య, శోభిత ధూళిపాళ కూడా ఉన్నారు. ఈ రోజు ఒక వైపు తండేల్ మూవీ రిలీజ్ అయ్యింది. ఈ మూవీకి ప్రస్తుతం అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.

తండేల్ ను చందు మొండేటీ తెరకెక్కించారు. ఈ సినిమా శ్రీకాకుళం జిల్లాలో జరిగిన యధార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. ఈ మూవీలో చైతూ, సాయిపల్లవిలు ఒక రేంజ్ లో అదరగొట్టారని ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలో నాగార్జున, అమలు, చైతు, శొభితలు ఢిల్లీలోని పార్లమెంట్ హాల్ లో నంద్యాల ఎంపీ శబరినీ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆ తర్వాత నాగార్జున ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు.

గతంలో మోదీ మన్ కీ బాత్ లో అక్కినేని నాగేశ్వర రావు చిత్ర పరిశ్రమకు చేసిన సేవల్ని మోదీ కొనియాడారు. అదే విధంగా మోదీ అక్కినేని నాగేశ్వరరావుపై ప్రశంసలు కురిపించిన నేపథ్యంలో నాగార్జున సైతం స్పందించారు. మోదీకి ప్రత్యేకంగా నాగార్జున సోషల్ మీడియా వేదికగా ధన్యవాదాలు తెలిపారు.

 తాజాగా జరిగిన మీటింగ్ అక్కినేని నాగేశ్వరరావు బయోగ్రఫీ లాంఛ్ గురించి అని వార్తలు వస్తున్నాయి. అయితే ప్రధానిని కలిసే ముందు నాగార్జున పార్లమెంటులోని టీడీపీ ఆఫీసు కు వెళ్లారు. మరోవైపు తండేల్ కు అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది.  

Read more: Viral Video: కుంభమేళలో విజయ్ దేవర కొండ.. రష్మిక ఎక్కడ బ్రో అంటున్న ఫ్యాన్స్ .. వీడియో వైరల్..

ఈ సినిమా ఒక రేంజ్ లో హిట్ ను సొంతం చేసుకుంటుందని అభిమానులు చెప్తున్నారు. నాగార్జున కుటుంబంతో సహా ఢిల్లీకి వెళ్లి మోదీని మర్యాద పూర్వకంగా కలుసుకొవడం ఇటు రాజకీయ వర్గాల్లోను, అటు సినిమా ఇండస్ట్రీలోను చర్చనీయాంశంగా మారింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

Trending News