Delhi New CM: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 5 జరిగాయి. ఎన్నికల ఫలితాలు ఈ నెల 8న వెలుబడ్డాయి. ఫలితాలు వెలుబడి 10 రోజులు దాటుతున్న సీఎం పీఠం దక్కేది ఎవరనే దానిపై సస్పెన్స్ కొనసాగుతుంది. దాదాపు 27 యేళ్ల తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి సింహాసనంపై బీజేపీ కి చెందిన వాళ్లు కూర్చోనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం ఎవరవుతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
Punjab Politics: ఢిల్లీ ఎన్నికల ఫలితాలు పంజాబ్ రాజకీయాలు పడ్డాయా.. ? ఢిల్లీ తర్వాత పంజాబ్ పీఠాన్ని కైవసం చేసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీకి ఇపుడు ఆ ఒక్క రాష్ట్రంలోనే అధికారంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఓటమి చవి చూసిన ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. ఇపుడు పంజాబ్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కోతున్నారా అంటూ ఔననే అంటున్నాయి రాజకీయా వర్గాలు.
Atishi Marlena Resign to CM Post: దేశ రాజధాని ఢిల్లీలో వరుసగా రెండు సార్లు అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీకి లిక్కర్ కుంభ కోణం అతిపెద్ద మచ్చగా మారింది. ఈ స్కామ్ లోనే ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆయన ప్లేస్ లో తను చెప్పినట్టు వినే ఆతిషికి ముఖ్యమంత్రి పగ్గాలు ఇచ్చారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఆప్ ఓడిపోవడంతో ఢిల్లీ ముఖ్యమంత్రి ఉన్న ఆతిషి రాజీనామా చేసారు.
Delhi CM Race: దాదాపు 27 యేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత ఢిల్లీ సీఎం పీఠం బీజేపీ వశం అయింది. అంతేకాదు దాదాపు 48 సీట్లలో బీజేపీ ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో బీజేపీ తరుపున ఎవరు ముఖ్యమంత్రి అవుతారనేది ఆసక్తికరంగా మారింది. అయితే.. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఢిల్లీ సీఎం రేసులో అరవింద్ కేజ్రీవాల్ ను చిత్తు చేసి జెయింట్ కిల్లర్ పర్వేష్ వర్మతో పాటు మరో ఐదుగురు పేర్లు వినిపిస్తున్నాయి.
Modi Vs Kejriwal: కేంద్రంలో నరేంద్ర మోడీ మూడు సార్లు ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినా.. ఆయన నివాసం ఉంటున్న ఢిల్లీలో గెలవలేదన్న లోటు ఉండేది. కానీ నిన్నటి ఎన్నికల ఫలితాలతో రచ్చ గెలవడమే కాదు. ఇంట కూడా గెలిచి చూపించారు. అందుకు కారణం కేజ్రీవాల్ అన్న మాటలే. ఢిల్లీలో తనను ఓడించాలంటే మోడీ మరో జన్మ ఎత్తాలి అన్న మాటను మోడీ సీరియస్ గా తీసుకున్నట్టు కనిపించారు. అందుకే ఈ సారి అన్ని బలగాలను మోహరించి కేజ్రీవాల్ ను మట్టి కరిచేలా చేసారు నరేంద్ర మోడీ.
Delhi Assembly Election Results: భారతీయ జనతా పార్టీ గల్లీ నుంచి ఢిల్లీ వరకు కొన్ని ఫార్ములాలతో అధికారం ఒడిసిపట్టుకుంటుంది.
ఒక్కో చోట ఒక్క వ్యూహాన్ని అమలు చేస్తూ విజయాలను తన ఖాతాలో వేసుకుంటుంది. తాజాగా జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అప్పట్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్.. ఆ తర్వాత హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో అమలు చేసిన వ్యూహంతోనే ఢిల్లీలో అధికారంలోకి వచ్చింది.
Delhi Assembly Election Results 2025: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీతో అధికారంలో వచ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ అగ్రనేత కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీని ఢిల్లీలో ఊడ్చేశాము. ఇక తెలంగాణలో కూడా అధికారంలోకి రాబోతున్నట్టు చెప్పారు.
Delhi Assembly Election Results 2025: ఢిల్లీ ఎన్నికల గెలుపులో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ అసలు సిసలు గేమ్ ఛేంజర్ గా నిలిచారా అంటే ఔననే అంటున్నాయి రాజకీయ విశ్లేషకులు. తాజాగా బడ్జెట్ లో ఆమె ప్రవేశ పెట్టిన పలు సంస్కరణలు ఢిల్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయానికి దోహదం చేశాయని అంటారు.
Delhi Assembly Election Results 2025: 2025 భారతీయ జనతా పార్టీకి మంచి బూస్టప్ అందించాయి. ముఖ్యంగా గత 27 యేళ్లుగా అందని ద్రాక్షగా ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠం ఎట్టకేలకు బీజేపీ వశం అయింది. అయితే ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత.. ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా ఓటమి పాలు అయ్యారు.
Delhi Assembly Election Results 2025: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమి దిశగా పయనిస్తోంది. ఆ పార్టీ 22 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.మరోవైపు బీజేపీ 50 స్థానాల్లో లీడ్ లో ఉంది. అందులో 20 స్థానాల్లో గెలిచింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమిపై అన్నా హజారే కీలక వ్యాఖ్యలు చేశారు.
Delhi Assembly Election Results 2025: ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో దాదాపు 27 సుధీర్ఘ విరామం తర్వాత బీజేపీ జెండా ఎగరేయబోతుంది. మరోవైపు వరుసగా రెండు సార్లు పూర్తిగా అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి అక్కడి ఓటర్లు గట్టి బుద్ధి చెప్పారు. రెండు సార్లు ఔట్ దాదాపు క్లీన్ స్వీప్ చేసిన చీపురు పార్టీకి అక్కడ ప్రజలు చీత్కరించారు. ముఖ్యంగా ఢిల్లీ గద్దె దిగడానికి ఆప్ చేసిన స్వయంకృతాపరాధాలే ఆ పార్టీని ఓడించేలా చేసాయి.
Delhi Election Results 2025: ఈ నెల 5న జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలుబడుతున్నాయి. ప్రెజెంట్ ట్రెండ్ చూస్తుంటే.. బీజేపీ దాదాపు 27 యేళ్ల తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేయడం దాదాపు ఖాయమనిపిస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ అధికారంలో వస్తే ఎవరు ముఖ్యమంత్రి అవుతారనేది ఆసక్తికరంగా మారింది.
Delhi Election Results 2025: దేశ రాజధాని ఢిల్లీలో వార్ వన్ సైడ్ అన్నట్టుగా బీజేపీ దూకుడు మీదుంది. గత రెండు పర్యాయాలు అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి అక్కడి ఓటర్లు బిగ్ షాక్ ఇచ్చారు. గత రెండు పర్యాయాలు దాదాపు క్లీన్ స్వీప్ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ.. ఈ సారి వెనకబడింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సోదిలో లేకుండా పోయింది.
Delhi Election Results 2025 Live: దేశ వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎగ్జిట్ పోల్ చెప్పిన ఫలితాలు వెల్లడవుతున్నాయి. ఇక ఈ ఎన్నికల్లో ఢిల్లీ ఓటర్లు ఆమ్ ఆద్మీ పార్టీకి చాచి కొట్టారు. దాదాపు పదేళ్ల బూటకపు హామిలతో విసిగిపోయిన ప్రజలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి పట్టం కట్టారు. ఏకంగా న్యూ ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత వెనకంజలో ఉంది.
PAWAN KALYAN: జనసేన అధినేత పవన్‌కల్యాణ్ గేమ్ చేంజర్ అయ్యారా..! మహారాష్ట్రలో పవన్ కల్యాణ్ ప్రచారం కారణంగానే బీజేపీ అభ్యర్ధులు భారీ విజయాన్ని నమోదు చేశారా..! ఇకమీదట పవన్ కల్యాణ్ సేవలకు విస్తృతంగా వాడుకోవాలని కమలం పార్టీ యోచిస్తుందా..! త్వరలో పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అక్కడ కూడా పవన్ సేవలను వాడుకోనేందుకు కమలం పార్టీ కసరత్తు చేస్తోందా..!
Sunitha Kejriwal: ఢిల్లీలో కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. డిల్లీ మద్యం కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయినా ఢిల్లీ పగ్గాలు మారలేదు. తెరవెనుక కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ కన్పిస్తున్నారు.
Aravind Kejriwal Arrest: దిల్లీ లిక్కర్ స్కామ్‌లో ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరెస్ట్ కావడంతో ఒక్కసారిగా దేశ రాజకీయాలు వేడెక్కాయి. తెలంగాణలో సీఎం కేసీఆర్ ముద్దుల తనయ కవిత అరెస్ట్ అయిన వారం వ్యవధిలోనే ఈ సంచలనం చోటు చేసుకుంది. మొత్తంగా దిల్లీ మద్యం కేసులో కేజ్రీవాల్ అరెస్ట్ నేపథ్యంలో అసలు లిక్కర్ స్కామ్ వెనక ఏం జరిగిందనేది ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారింది.
ప్రజా సమస్యలపై బీజేపీ పోరాడుతుంటే... ప్రజల దృష్టిని మళ్లించేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న డ్రామాలని మండిపడ్డారు. పొరపాటున కేసీఆర్ కు మళ్లీ అధికారమిస్తే యువత అంతా సూసైడ్ నోట్ రాసుకున్నట్లేనని హెచ్చరించారు. కొలువులు కావాలంటే కమలం రావాలంటూ నినదించారు. ఖమ్మం నిరుద్యోగ ర్యాలీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు బండి సంజయ్ చురకలు అంటించారు.
Kejriwal on Modi: దేశ ప్రధాని నరేంద్ర మోదీపై ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 2000 నోట్ల రద్దుపై విమర్శలు ఎక్కుపెట్టారు. అందుకే ప్రధానిగా ఉన్న వ్యక్తి చదువుకున్నవాడై ఉండాలనేదంటూ ఎద్దేవా చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.