Delhi Assembly Election Results 2025: దేశ రాజధాని ఢిల్లీ శాసన సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అనూహ్య విజయం సొంతం చేసుకుంది. దాదాపు 27 యేళ్ల అక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చింది. అంతేకాదు ఆప్ అగ్రనేత మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ వంటి పలువురు అగ్ర నేతలు ఈ ఎన్నికల్లో దారుణ పరాజయం పాలయ్యారు. గత ఎన్నికల్లో 70 అసెంబ్లీ సీట్లకే పరిమితమైన భారతీయ జనతా పార్టీ ఈ సారి ఏకంగా 48 స్థానాల్లో విజయ కేతనం ఎగరేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 22 స్థానాలకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో దేశ రాజధానితో పాటు దేశ వ్యాప్తంగా బీజేపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. సంబురాలు అంబరాన్ని తాకాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ అగ్ర నేత కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ మేధావులారా ఆలోచించి ఓటేయాలని బండి సంజయ్ పిలుపు నిచ్చారు. ముఖ్యంగా ఢిల్లీలో అక్రమ దందాలకు పాల్పడుతున్న ఆమ్ ఆద్మీ పార్టీని ఢిల్లీ ప్రజలు చీపురును ఛీ కొట్టారన్నారు. అంతేకాదు ఆ పార్టీని ఊడ్చిపారేశారన్నారు. అంతేకాదు ఇకపై ‘‘ఢిల్లీ మాదే... తెలంగాణసహా దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలను ఏర్పాటు చేయబోయేది బీజేపీనే అన్నారు. త్వరలో ఇక్కడ జరగనున్న 3 ఎమ్మెల్సీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
చీపురును ఛీ కొట్టారు..
చేతిని చిదిమేశారు…
కమలాన్ని వికసింపజేశారు.ఢిల్లీ అయినా…గల్లీ అయినా బిజెపితోనే మనసంతా
మన @narendramodi గారితోనే మేమంతా అని చాటిన ప్రజలకు కృతజ్ఞతలు.#DelhiElections— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) February 8, 2025
ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో బండి సంజయ్ కుమార్ హైదరాబాద్ లో మీడియాతో చిట్ చాటు చేశారు. అనంతరం ఎక్స్ వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘‘చీపురుతో ఛీ కొట్టారు. చేతిని చిదిమేశారు. కమలాన్ని వికసింపజేశారు. ఢిల్లీ అయినా గల్లీ అయినా బీజేపీతోనే మనసంతా, ప్రియతమ ప్రధాని నరేంద్రమోదీతోనే మేమంతా అని చాటిచెప్పిన ఢిల్లీ ప్రజలకు కృతజ్ఝతలు తెలియజేసారు.
అక్రమ దందాలతో, అక్రమాలతో జైలుకు పోయిన నాయకుడు మాకొద్దు అంటూ తీర్పునిచ్చారు. నీతివంతమైన నరేంద్ర మోడీ పాలన ఢిల్లీలోనూ రావాలని ప్రజలు ఆకాంక్షించారు. అందుకే చీపురుతోనే ఆప్ పార్టీని ఊడ్చి పారేశారన్నారు. వార్ వన్ సైడ్ అన్నట్లుగా ఢిల్లీ ప్రజలు బీజేపీకే పట్టం కట్టారు. తెలంగాణసహా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం త్వరలోనే రావడం పక్కా అని చెప్పారు. ఇకపై ఢిల్లీ పీఠం మాదే... త్వరలోనే తెలంగాణలోని ఎమ్మెల్సీ సీట్లు కూడా బీజేపీ పరమే కాబోతున్నాయ్ అన్నారు. ఎందుకంటే తెలంగాణ నిరుద్యోగులు, బడుగు, బలహీన వర్గాల తరుపున ప్రశ్నించే పార్టీ బీజేపీన అన్నారు. ఉద్యోగులు, పట్టభద్రులు, మేధావుల పక్షాన పోరాడేది బీజేపీ, ఢిల్లీలో మేధావులంతా ఎట్లయితే బీజేపీని ఆదరించారో... తెలంగాణలోని మేధావులు, పట్టభద్రులు, ఉపాధ్యాయులంతా ఆలోచించుకుని బీజేపీకి ఓటేయాలని కోరారు.
ఇదీ చదవండి: గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!
ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.