Delhi CM Race: ఢిల్లీ సీఎం రేసులో ఐదుగురు ? హస్తిన సింహాసనం దక్కేది ఎవరికంటే..

Delhi CM Race: దాదాపు 27 యేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత ఢిల్లీ సీఎం పీఠం బీజేపీ వశం అయింది. అంతేకాదు దాదాపు 48 సీట్లలో బీజేపీ ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో బీజేపీ తరుపున ఎవరు ముఖ్యమంత్రి అవుతారనేది ఆసక్తికరంగా మారింది. అయితే.. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఢిల్లీ సీఎం రేసులో అరవింద్ కేజ్రీవాల్ ను చిత్తు చేసి జెయింట్ కిల్లర్ పర్వేష్ వర్మతో పాటు మరో  ఐదుగురు పేర్లు వినిపిస్తున్నాయి.

Written by - TA Kiran Kumar | Last Updated : Feb 9, 2025, 12:23 PM IST
Delhi CM Race: ఢిల్లీ సీఎం రేసులో ఐదుగురు ? హస్తిన సింహాసనం దక్కేది ఎవరికంటే..

Delhi CM Race: ఢిల్లీ శాసనసభ ఎలక్షన్స్ లో  బీజేపీ దూకుడు చూపించింది. అంతేకాదు వరుసగా రెండు సార్లు భారీ మెజార్టీతో అధికారంలో వచ్చిన ‘ఆమ్ ఆద్మీ పార్టీ’ని చిత్తు చేసి భారతీయ జనతా పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయంతో ఆ పార్టీలో కొత్త జోష్ కనిపిస్తోంది. రెండున్నర దశాబ్దాల తర్వాత ఢిల్లీ పీఠాన్ని దక్కించుకున్న బీజేపీ కి ఇప్పుడు సీఎం పదవి ఎవరిని వరిస్తుందో అన్న చర్చ జరుగుతోంది. సీనియర్ నేతకు ఇస్తుందా లేక మహిళా నేతకు అప్పగిస్తుందా. లేదంటే అనూహ్యంగా ఏదైనా కొత్త పేరును తెరపైకి తెస్తుందా. అనే చర్చ జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో సీఎం రేసులో  వీళ్లే ఉన్నారంటూ  ప్రచారం అప్పుడే జోరందుకుంది.  ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. ‘న్యూ ఢిల్లీ’ అసెంబ్లీ స్థానం నుంచి ఓడిపోవడం గమనార్హం. ఆయన్ని ఢిల్లీలో ఓడించిన పర్వేష్ వర్మ ముఖ్యమంత్రి రేసులో ముందున్నారు. మరోవైపు ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న వీరేంద్ర సచ్ దేవా పేరు కూడా రేసులో వినిసిస్తోంది. ప్రస్తుతం బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడిగా వీరేంద్ర సచ్‌దేవా కొనసాగుతున్నారు. మరోవైపు నార్త్ ఈస్ట్ ఢిల్లీ నుంచి ఎంపీగా మనోజ్ తివారీ కూడా ఢిల్లీ సీఎం రేసులో ఉన్నారు.  

ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ  చీఫ్ అరవింద్ కేజ్రివాల్ ను ఓడించిన పర్వేష్ వర్మ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. అటు  విజయేందర్ గుప్త.. కైలాష్ గెహ్లాట్, మనోజ్ తివారి, బీజేపీ ఢిల్లీ ఛీప్ వీరేంద్ర సచ్ దేవ పేర్లు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా దుష్యంత్ గౌతమ్, మహిళ నేతలు బన్సూరి స్వరాజ్, స్మృతి ఇరాని లాంటి వాళ్లకి  అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది.

ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?

ఏది ఏమైనా 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ పీఠం దక్కించుకుంది. ఈ నేపథ్యంలో సీఎం ఎంపికపై ఆ పార్టీ హై కమాండ్ ఆచి తూచి అడుగులు వేయనుంది బీజేపీ. ఎప్పటిలాగే సాంప్రదాయాన్ని పాటిస్తూ సీఎం అభ్యర్థి లేకుండానే ఢిల్లీ ఎన్నికల బరిలోకి దిగింది బీజేపీ.  ఇప్పుడు అనేక అంశాలు..సమీకరణాలు పరిగణలోనికి తీసుకొని సీఎం ను ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఎంపీలుగా ఉన్న మనోజ్ తివారీ, బాన్సూరి స్వరాజ్ లను  సీఎంగా ఎంపిక చేయకపోవచ్చు. ఎమ్మెల్యేగా గెలిచిన అభ్యర్ధుల్లో ఎవరినైనా ఒకరిని ఎంపిక చేసే అవకాశాలున్నాయి. మరోవైపు బీజేపీ అనూహ్యంగా మహిళకు సీఎం అభ్యర్ధిగా ప్రకటించాల్సి వస్తే.. బాన్సురి స్వరాజ్, స్మృతి ఇరానీ, మీనాక్షి లేఖి పేర్లు పరిశీలనకు వచ్చే అవకాశాలున్నాయి. మరోవైపు మరో ఇద్దరిని డిప్యూటీ సీఎంగా నియమించే అవకాశాలున్నాయి. ఢిల్లీ ఎన్నికల్లో గెలిచిన నేపథ్యంలో ఈ రోజు గెలిచిన ఎమ్మెల్యేల సమావేశం కానున్నారు. ఈ రోజే తమ శాసన సభ పక్ష నేతను ఎన్నుకునే అవకాశాలున్నాయి.

ఇదీ చదవండి:   గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!

ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News