Sai Pallavi: తండేల్ హీరోయిన్ సాయి పల్లవి ఇటీవల మూవీ ప్రమోషన్స్ లలో భాగంగా చైతుతో కలిసి ఇంటర్వ్యూలో ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా తన అలవాట్ల గురించి నేచురల్ బ్యూటీ చెప్పుకొచ్చారు.
తండేల్ మూవీ ఈరోజు విడుదలైంది. ఈ సినిమా అభిమానుల నుంచి అదిరిపోయేటాక్ ను సొంతం చేసుకుంది. చందు మొండేటీ తండేల్ ను తెరకెక్కించారు. శ్రీకాకుళంలో మత్య్సకారుల యదార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది.
ఈ సినిమా విడుదలకు ముందు సాయి పల్లవి, చైతు ప్రమోషన్స్ లలో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ క్రమంలో నేచురల్ బ్యూటీ, చైతు అడిగిన అనేక ప్రశ్నలకు సమాధానాలు చేప్పారు. ప్రస్తుతం నేచురల్ బ్యూటీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్గా మారాయి. ముఖ్యంగా సాయి పల్లవి దీనిలో తన బ్యూటీ సీక్రెట్స్ గురించి బైటపెట్టింది.
సాయి పల్లవి మాట్లాడుతూ.. ప్రతి రోజు బన్ తీసుకుంటే ఇష్టమని అన్నారు.కొబ్బరి నీళ్లను ఎక్కువగా తాగుతానని చెప్పుకొచ్చింది. రాత్రి 9 గంటలు అయితే చాలు ఫోన్ పక్కన పడేసి పడుకుంటానని చెప్పింది.
తన ముఖానికి గుర్తుకు వచ్చినప్పుడు మాత్రమే మాయిశ్చరైజేషన్ చేసుకుంటానని చెప్పింది. అయితే.. వంట చేసుకొవాలని అన్పిస్తుందని కానీ.. సమయం చాలక ఆర్డర్ పెట్టేసుకుని ఇష్టమైన ఫుడ్ ను తినేస్తానని సాయి పల్లవి క్లారిటీ ఇచ్చింది.
తనకు అబ్బాయిలు క్లీన్ గా ఐరన్ చేసుకుని అబ్బాయిలు దుస్తులు వేసుకుంటే ఇష్టమనిచెప్పింది. అంతే కాకుండా..తన కుటుంబంలో ఎవరైన.. నలిగిపోయిన బట్టలు వేసుకుంటే వెంటనే చెప్తానని కూడా నేచురల్ బ్యూటీ చెప్పింది. తేనెటీగల పెంపకం చేస్తున్నానని చెప్పింది.
సినిమాలు చూడటం బోరుగా అన్పిస్తే పొలం పనులు చేస్తానని కూడా నటి చెప్పింది. తన తోటలో క్యారెట్ లను పండిస్తున్నట్లు కూడా తండేల్ నటి చెప్పింది. అయితే.. సాయి పల్లవి అబ్బాయిలు నలిగిన బట్టలు వేసుకొకుండా నీట్గా ఐరన్ వేసుకుని ఉంటే నచ్చుతారని చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్గా మారాయి.