Parvesh Sahib Verma: పర్వేష్‌ సాహిబ్‌ వర్మ.. ఢిల్లీ అసెంబ్లీ గడ్డపై మాజీ సీఎం కేజ్రీవాల్‌ను ఓడించిన ఈ జెయింట్ కిల్లర్‌ ఎవరో తెలుసా?

Who Is Parvesh Sahib Verma: ఢిల్లీ అసెంబ్లీ 2025 ఎన్నికల ఫలితాలు విడుదలైనాయి. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (BJP) చేతిలో ఆమ్ అడ్మిట్ పార్టీ (AAP) ఓడిపోయింది. అయితే ఈ ఎన్నిక అసెంబ్లీ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించిన పర్వేష్‌ సాహిబ్‌ వర్మ ఎవరు? ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గేమ్‌ ఛేంజర్‌గా మారిన పర్వేష్‌ వర్మ గురించి అందరూ ఇప్పుడు సెర్చ్‌ చేస్తున్నారు. ఆయన గురించిన పూర్తి వివరాలు ఇవే..

Written by - Renuka Godugu | Last Updated : Feb 8, 2025, 02:24 PM IST
Parvesh Sahib Verma: పర్వేష్‌ సాహిబ్‌ వర్మ.. ఢిల్లీ అసెంబ్లీ గడ్డపై మాజీ సీఎం కేజ్రీవాల్‌ను ఓడించిన ఈ జెయింట్ కిల్లర్‌ ఎవరో తెలుసా?

Who Is Parvesh Sahib Verma: న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజక వర్గంలో మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఓడించిన పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ. ఆయన బీజేపీ పార్టీలో మొదటి నుంచి అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నాడు. ముఖ్యంగా మాజీ మంత్రి అరవింద్ కేజ్రీవాల్, పర్వేశ్ వర్మ మధ్య అత్యంత పోటా పోటీ జరిగింది. అయితే ఈ ఎన్నికల్లో న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పర్వేష్‌ సాహిబ్‌ విజయ ఢంకా మోగించారు.

పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ ఎవరు?
ఢిల్లీ రాజకీయ కుటుంబానికి చెందిన పర్వేశ్ సాహిబ్ సింగ్ ఎవరో కాదు.. మాజీ ఢిల్లీ సీఎం సాహిబ్ సింగ్ వర్మ కొడుకు. ఇతని మామ కూడా ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా కూడా పనిచేశారు, అలాగే ముండక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బిజెపి తరఫున 2013 ఎన్నికల్లో పోటీ చేశారు.

ఇక పర్వేశ్ సాహిబ్ సింగ్ 1977లో జన్మించారు. ఈయన స్కూలు విద్య అంతా ఆర్కే పురంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో పూర్తి చేశారు. ఆ తర్వాత కిరోరి మాల్ కాలేజ్ లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ చదివారు. పర్వేశ్ సాహిబ్ సింగ్ ఎంబీఏ కూడా పూర్తి చేశారు. ఆ తర్వాత  2013లో రాజకీయాల్లో కెరీర్‌ ప్రారంభించారు. ఆ ఏడాది ఢిల్లీ మెహ్రౌలీ నియోజకవర్గ నుంచి పోటీ చేసి గెలిచారు.

2014లో ఢిల్లీ పార్లమెంటు సీటును కైవసం చేసుకుని ఆ తర్వాత ..2019లో కూడా ఎన్నికయ్యారు. దాదాపు 5.78 లక్షల మెజారిటీతో గెలిచారు. ఇక పర్వేశ్ సాహిబ్ సింగ్ పార్లమెంటు మెంబర్‌గా కూడా పని చేశాడు. పర్వేష్‌ జీతభత్యాలపై జాయింట్ కమిటీ సభ్యుడిగా, స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా కూడా పనిచేశారు. 

AAP అరవింద్ కేజ్రీవాల్‌ 22057
BJP పర్వేష్‌ వర్మ 25057
Congress సందీప్‌ దీక్షిత్‌ 3873

 

ఇదీ చదవండి:  బొప్పాయి తినడం వల్ల బోలెడు బెనిఫిట్స్‌.. మీ శరీరానికి నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు..

ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ విజయంలో పర్వేశ్ సాహిబ్ సింగ్‌ది కీలక పాత్ర. ముఖ్యంగా 2025 ఎన్నికల్లో 'Remove Kejrival.. Save Nation' అనే నినాదంతో దూసుకెళ్లాడు.  ముఖ్యంగా ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఈ వివాదాస్పద నేత ప్రజల్లోకి లోతుగా తీసుకెళ్లారు. ఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగరవేయడానికి ఈయనది కీలక పాత్ర అని చెప్పడంలో ఏ మాత్రం తప్పులేదు. ముఖ్యంగా ఢిల్లీలో మహిళల భద్రత, కాలుష్య నివారణ వంటివి ఆమ్ ఆద్మీ పార్టీ ఫెయిల్ అయిందని ఎన్నికల ప్రచారంలో వాటిని లక్ష్యంగా చేసుకున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు దూరంగా ఉన్న పర్వేష్‌ సాహిబ్ 2025 ఎన్నికల్లో తిరిగి పుంజుకుని మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కే చెక్‌ పెట్టాడు. 

ఇదీ చదవండి: ఎయిర్‌టెల్‌ సిమ్‌ వాడుతున్నారా? ఇలా 3 నెలలు నెట్‌ఫ్లిక్స్‌ ఉచితం తెలుసా?  

 2020 ఎన్నికల సమయంలో అరవింద్ కేజ్రీవాల్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు పర్వేష్‌ సింగ్ సాహిబ్‌. ముఖ్యంగా అరవింద్ కేజ్రీవాల్ ఒక ఉగ్రవాది అని వ్యాఖ్యలు చేయడంతో ఎన్నికల సంఘం అతని 24 గంటల పాటు సస్పెండ్ కూడా చేసింది. తాజా ఎన్నికల్లో ఆ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఓడించి తన సత్తా చాటాడు పర్వేష్‌ సాహిబ్‌ సింగ్‌ వర్మ.
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News