Modi Vs Kejriwal: జన్ లోక్ పాల్ అంటూ గళమెత్తిన అన్నా హజారే శిష్యుడిగా గుర్తింపు పొందిన అరవింద్ కేజ్రీవాల్.. ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ స్థాపించి ముందుగా సామాన్య మధ్యతరగతి ప్రజలను ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత రాను రాను కేజ్రీవాల్ అసలు స్వరూపం ఏంటో ప్రజలకు తెలిసొచ్చింది. మొదటి సారి 2 నెలల లో ముఖ్యమంత్రిగా చేసిన అరవింద్ కేజ్రీవాల్... 2015, 2020 ఎన్నికల్లో భారీ మెజారిటీ అనే కంటూ దాదాపు క్లీన్ స్వీప్ చేసాడు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ పలు సందర్భాల్లో ఢిల్లీ లో నరేంద్ర మోడీ పీఎం కాగలేడేమో కానీ... ఢిల్లీలో ఆయన గెలవాలంటే మరో జన్మ ఎత్తాలంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. దానికి సంబంధించిన పాత వీడియో ప్రస్తుతం బీజేపీ సోషల్ మీడియా వింగ్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
తను 2025 కాదు కదా.. 2050 వరకు ఓడించలేడు అని అహంకారపు మాటలు మాట్లాడిన కేజ్రీవాల్ ను ఈ ఎన్నికల్లో ఓడించి సత్తా చాటారు నరేంద్ర మోడీ. మొత్తంగా ఆమ్ ఆద్మీ పార్టీ అధినేతగా అరవింద్ కేజ్రీవాల్ అహంకారపు మాటలను చూసి ఓటర్లు చాచి ఓటుతో కొట్టారు. అంతేకాదు ఆయన్ని ఏకంగా అసెంబ్లీకి కూడా వెళ్లకుండా ఓడగొట్టారు. మొత్తంగా ఢిల్లీని గెలవాలంటే రెండో జన్మ ఎత్తాలన్న కేజ్రీవాల్ ను ఏకంగా అసెంబ్లీ లోకి రాకుండా చేయడం విశేషం. మొత్తంగా స్వాతంత్య్రం తర్వాత ఢిల్లీ రాష్ట్రంతో పాటు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఒకేసారి ఉండటం ఇదే మొదటి సారి.
అయితే ఢిల్లీ అసెంబ్లీలో గెలుపుతో మంచి ఊపు మీదున్న నరేంద్ర మోడీ.. ఇక్కడి ప్రజలకు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఢిల్లీ ప్రజలకు విముక్తి లభించిందన్నారు. ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ విజయం సామాన్య విజయం కాదన్నారు. వికసిత్ రాజధానిగా మార్చే అవకాశం తమకు ప్రజలు ఇచ్చారన్నారు. ఢిల్లీని అభివృద్ధి చేసి ప్రజల రుణం తీర్చుకుంటామన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్‌పై ప్రజలు నమ్మకం ఉంచారని మోదీ వ్యాఖ్యానించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సందర్భంగా బీజేపీ శ్రేణులు ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో విజయోత్సవ సంబరాలు శనివారం సాయంత్రం నిర్వహించారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పలువురు నేతలు నరేంద్ర మోడీని గజమాలతో సత్కరించారు.
ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?
దేశ రాజధాని ఢిల్లీలో కాషాయజెండా27 ఏళ్ల సుధీర్ఘ నిరీక్షణ తర్వాత రెప రెపలాడింది. ఢిల్లీలో కమలం పార్టీ అపూర్వ విజయం అందుకుంది. రెండుసార్లు ఢిల్లీ పీఠాన్ని అధిరోహించిన ఆప్పార్టీని బీజేపీ మట్టికరిపించింది. 48 స్థానాల్లో బీజేపీ, 22 స్థానాల్లో ఆప్ గెలుపొందింది. ఆప్ అధినేత, మాజీ సీఎం న్యూఢిల్లీలో ఓటమిపాలయ్యారు. బీజేపీ అభ్యర్థి పర్వేజ్ సాహిబ్ సింగ్ చేతిలో కేజ్రీవాల్ ఓడిపోయారు. ఢిల్లీ సీఎం ఆతిశీ మార్లేనా అతి తక్కువ మెజారిటీ విజయం సాధించారు. కల్కాజీ నుంచి పోటీ చేసిన ఆమె సమీప ప్రత్యర్థి, బీజేపీ నేత రమేశ్ బిధూరీని ఓడించారు.
మరోవైపు ఢిల్లీలో ఆప్ అపజయాన్ని అంగీకరించారు ఆ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్. ప్రజల తీర్పును సగౌరవంగా స్వీకరిస్తున్నామన్నారు. ఈవీఎం ట్యాంపరిగ్ వంటివి నోటి నుంచి రాకుండా జాగ్రత్త పడ్డారు. గెలిచిన బీజేపీకి అభినందనలు తెలియజేసారు. జనం పెట్టుకున్న ఆకాంక్షలను బీజేపీ నెరవేరుస్తుందని ఆశిస్తున్నామన్నారు. గత పదేళ్లలో హెల్త్, ఎడ్యూకేషన్, ఇన్ఫ్రా రంగాల్లో తమ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందన్నారు. ఇకపై ఢిల్లీలో నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తామన్నారు. ఇకపై ప్రజా సేవలో కొనసాగుతామన్నారు అరవింద్ కేజ్రీవాల్.
ఇదీ చదవండి: గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!
ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.