Kumbh mela women holy dip unclothed photos row: ప్రయాగ్ రాజ్ కుంభమేళ త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించేందుకు భక్తలు దేశ వ్యాప్తంగా తరలి వస్తున్నారు. 144 ఏళ్ల తర్వాత ఏర్పడిన కుంభమేళలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు ఆసక్తి చూపిస్తున్నారు. జనవరి 13న ప్రారంభమైన కుంభమేళ, ఫిబ్రవరి 26తో ముగియనుంది. ఇదిలా ఉండగా.. ఇప్పటి వరకు కుంభమేళలో దాదాపుగా.. 55 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు యూపీ సర్కారు వెల్లడించింది. కుంభమేళలో ప్రతిరోజు వస్తున్న భక్తుల సంఖ్య ఏమాత్రం తగ్గడంలేదు.
Extremely Shocking🥶
𝐀𝐯𝐚𝐢𝐥𝐚𝐛𝐥𝐞 𝐟𝐨𝐫 𝐒𝐚𝐥𝐞 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦: Photos and Videos of Hindu Devout Women bathing and changing at Maha Kumbh Mela pic.twitter.com/PuDvB56QMr
— 𝑪𝒂𝒕𝒂𝒍𝒆𝒚𝒂🛡 (@catale7a) February 19, 2025
ఈ క్రమంలో కుంభమేళలో ప్రస్తుతం యూపీ యోగి ఆదిత్యనాథ్ సర్కారు తాత్కలిక ఏర్పాట్లను చేసింది. కానీ కోట్లల్లో వస్తున్న భక్తులకు సరిపడా సదుపాయాలు మాత్రం లేవని చెప్పుకొవచ్చు. అయితే.. ముఖ్యంగా కుంభమేళలో అమ్మాయిలు, మహిళలు కూడా వచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు .
కొంత మంది దుర్మార్గులు మహిళలు, యువతులు స్నానం చేస్తుండగా.. బట్టులు మార్చుకుంటుండగా.. సీక్రెట్ గా వీడియోలు, ఫోటోలను తీసి ఆన్ లైన్ సైట్ లలో ఉంచుతున్నట్లు విషయం వెలుగులోకి వచ్చింది. యువతులు, మహిళల ఫోటోలు, వీడియోలను చూడాలంటే.. డబ్బులు చెల్లించాలంటూ కూడా లింక్ లు కూడా కేటుగాళ్లు పెట్టారు. దీనిపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా కుంభమేళకు వచ్చే భక్తులు ఆందోళన చెందుతున్నారు.
ఇలాంటి వారిని కట్టడి చేసి.. దారుణంగా పనిష్మెంట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం దీనిపై ప్రయాగ్ రాజ్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దుండగుల కోసం విచారణ చేపట్టారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో మహిళలు, యువతులు తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి