Delhi Election Results 2025: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టే బీజేపీ దూకుడు మీదుంది. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో న్యూ ఢిల్లీ స్థానం నుంచి అరవింద్ కేజ్రీవాల్ పడుతూ లేస్తూ ఉన్నారు. ఆయనకు అక్కడ బీజేపీ తరుపున ఢిల్లీ మాజీ సీఎం సాహెబ్ సింగ్ వర్మ కుమారుడు పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ గట్టి పోటీ ఇస్తున్నారు. అటు మరోవైపు కల్కాజీ స్థానంలో ఆతిషీ వెనకంజ వేసింది. మరోవైపు పత్ పర్ గంజ్ నుంచి ఆప్ అభ్యర్థి వెనకంజలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో కాషాయ జెండా ఎగరేయడం దాదాపు ఖాయమైంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఎవరు ఎన్నికవుతారనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా ఢిల్లీ ఎన్నికల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి ఆతిషీ మార్లెనా పై పోటీ చేసిన రమేశ్ బిధూరి గట్టి పోటీ ఇస్తున్నారు. ఆయన బీజేపీ తరుపున ముఖ్యమంత్రి అభ్యర్దిగా రేసులో ఉన్నారు.
మరోవైపు కేజ్రీవాల్ కు న్యూ ఢిల్లీ స్థానం నుంచి చుక్కలు చూపిస్తూన్న పర్వేష్ సింగ్ వర్మ కూడా సీఎం రేసులో ముందున్నారు. మరోవైపు ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న వీరేంద్ర సచ్ దేవా పేరు కూడా రేసులో ఉంది. మరోవైపు నార్త్ ఈస్ట్ ఢిల్లీ నుంచి ఎంపీగా మనోజ్ తివారీ కూడా ఢిల్లీ సీఎం రేసులో ఉన్నారు. ప్రస్తుతం బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడిగా వీరేంద్ర సచ్‌దేవా కొనసాగుతున్నారు. ఆయన సీఎం రేసులో ఉన్నారు.
ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?
మొత్తంగా ఎంపీగా ఉన్న మనోజ్ తివారీని సీఎంగా ఎంపిక చేయకపోవచ్చు. ఎమ్మెల్యేగా గెలిచిన అభ్యర్ధుల్లో ఎవరినైనా ఒకరిని ఎంపిక చేసే అవకాశాలున్నాయి. మరోవైపు బీజేపీ అనూహ్యంగా మహిళకు సీఎం అభ్యర్ధిగా ప్రకటించాల్సి వస్తే.. బాన్సురి స్వరాజ్, స్మృతి ఇరానీ, మీనాక్షి లేఖి పేర్లు పరిశీలనకు వచ్చే అవకాశాలున్నాయి. మరోవైపు మరో ఇద్దరిని డిప్యూటీ సీఎంగా నియమించే అవకాశాలున్నాయి.
ఇదీ చదవండి: గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!
ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.