Gold Rate Today: రికార్డ్ బద్దలు కొట్టిన పసిడి ధర.. ఒక్కరోజే రూ. 2,430పెరిగిన బంగారం.. తులం @ 88వేలు

Gold Rate Today: బంగారం ధర రికార్డు బద్దలు కొడుతోంది. భారీగా పెరుగుతూ సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. ముఖ్యంగా ధరలు పెరగడానికి ప్రధాన కారణంగా అంతర్జాతీయంగా నెలకొన్న అంశాలు. బంగారం ధరలు గడిచిన వారం రోజుల్లోనే  రికార్డు స్థాయిలో పెరిగాయి. బంగారం ధరలు పెరగడానికి దారితీసిన కారణాలతోపాటు భవిష్యత్తులో బంగారం ధర ఏ మేరకు పెరగవచ్చనే అంశాలతోపాటు తాజా బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. 

1 /7

Gold Rate Today:  బంగారం ధరలు వరుసగా రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. తాజాగా ఫిబ్రవరి 11వ తేదీ మంగళవారం కూడా భారీగా పెరిగాయి. 24క్యారెట్ల పది గ్రాముల బంగారం ధఱ రూ. 88,530 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరరూ. 80,400గా ఉంది. కిలో వెండి ధర రూ. 1,02,500పలుకుతోంది. బంగారం ధరలు భారీగా పెరగడానికి ప్రధానంగా గడిచిన నాలుగు సెషన్లు స్టాక్ మార్కెట్లో నమోదు అవుతున్న నష్టాలు అనే చెప్పవచ్చు. దీనికి తోడు అమెరికాలో ఒక ఔన్స్ బంగారం ధర 2900 డాలర్లపైకి చేరుకుంది. 

2 /7

బంగారం ధరలు పెరగడానికి ప్రధానంగా అంతర్జాతీయ కారణాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న అనేక నిర్ణయాల కారణంగా స్టాక్ మార్కెట్లో పెద్ద మొత్తంగా నష్టపోతున్నారు. 

3 /7

ఇదిలా ఉంటే బంగారం ధరలు కంట్రోల్ అవ్వడానికి ప్రధానంగా మార్కెట్ డిమాండ్ కు అనుగుణంగా ధరలను నిర్ణయిస్తుంటారు. బంగారం ధరలు గడిచిన ఏడాది కాలంగా గమనించినట్లయితే భారీగా పెరిగాయి

4 /7

 గత ఏడాది ఫిబ్రవరి నెలలో ప్రస్తుతం బంగారం ధర 63వేల రూపాయలుగా ఉంది. అప్పటినుంచి భారీగా పెరుగుతూ ప్రస్తుతం తులం ధర 89వేల సమీపానికి చేరుకుంది.   

5 /7

బంగారం ధరలు భారీగా పెరగడానికి ప్రధాన కారణంగా అంతర్జాతీయ పరిస్థితులతోపాటు దేశీయంగా కూడా పలు కారణాలున్నాయి.

6 /7

ముఖ్యంగా దేశీయంగా స్టాక్ మార్కెట్లో భారీ ఎత్తున పతనం అవుతున్నాయి. ముఖ్యంగా ఐటీ కంపెనీలతోపాటు ఫార్మా రంగానికి చెందిన కంపెనీలు పెద్దెత్తున నష్టపోతున్నాయి

7 /7

ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇతర దేశాలపై సుంకం పేరుతో పెద్దెత్తున కొరడా జులిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మనదేశానికి చెందిన పౌరులను అక్రమంగా వలసదారులుగా గుర్తించి ఒక బ్యాచ్ విద్యార్థులను అమెరికా నుంచి నేరుగా భారత్ కు పంపించింది. ఇవన్నీ కూడా బంగారం ధరలు పెరగడానికి కారణం అవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.