CM Revanth Reddy: సీఎం రేవంత్ కు ఊహించని బిగ్ షాక్ ..

CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఊహించని బిగ్ షాక్ తగలనుందా.. అంటే ఔననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. అవును ఒకేసారి రేవంత్ కు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ తో పాటు ఎమ్మెల్యేల అనర్హత వేటు పొంచి ఉన్నాయి. అందులో నుంచి బయట పడితే ఓకే.. లేకపోతే  అంతే సంగతులు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Written by - TA Kiran Kumar | Last Updated : Feb 11, 2025, 12:07 PM IST
CM Revanth Reddy: సీఎం రేవంత్ కు ఊహించని బిగ్ షాక్ ..

CM Revanth Reddy: తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒకేసారి రెండు పరీక్షలు ఎదురు కానున్నాయి. అందులో ఒకటి పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడటం గ్యారంటీగా కనిపిస్తోంది. అవును బీఆర్ఎస్ నుంచి పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ను ఆదేశించాలని కోరుతూ సుప్రీం కోర్టులో మూడు వేర్వేరు పిటిషన్లు దాఖలయిన సంగతి తెలిసిందే కదా.  నిన్న ఆ పిటిషన్లపై జస్టిస్‌ బీఆర్‌ గవాయి, జస్టిస్‌ కే.వినోద్‌ చంద్రన్‌ ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. వాదనల సందర్భంగా ఒక ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది.. కాంగ్రెస్ పార్టీలో చేరి ఎంపీగా పోటీ చేశారని.. దానం నాగేందర్‌ను ఉద్దేశించి కేటీఆర్  తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.

మిగతా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల తీరును కూడా కోర్టుకు వివరించారు.ఈ క్రమంలోనే అసెంబ్లీ కార్యదర్శి  తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీ కలుగజేసుకుని ఎమ్మెల్యేలపై అనర్హతకు ఇంకా సమయం కావాలని అభ్యర్థించారు. ఆయన వాదనలు విన్న కోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికే 10 నెలల సమయం గడిచిపోయిందన్నారు.  అది రీజనబుల్ టైం కాదా అని మండిపడింది. అందుకు ముకుల్ రోహత్గీ  స్పందిస్తూ.. తమ నిర్ణయాన్ని తెలిపేందుకు మరో నాలుగైదు రోజులు సమయం ఇవ్వాలని కోర్టును కోరారు. దీంతో కేసులో తదుపరి విచారణను ధర్మాసనం ఈ నెల 18కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

మొత్తంగా ఒకవేళ సుప్రీంకోర్టు స్పీకర్ కు డెడ్ లైన్ విధిస్తే.. 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడటం ఖాయం అనే మాట వినిపిస్తోంది. రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ లా ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపినా.. బీఆర్ఎస్ నుంచి 2/3 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారలేదు. అదే అప్పట్లో కేసీఆర్.. కాంగ్రెస్ పార్టీకి చెందిన 2/3 ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోని తమ పార్టీలో విలీనం చేసుకున్నారు. కేసీఆర్ కు వర్కౌట్ అయినా.. ఆ ప్లాన్.. రేవంత్ రెడ్డికి రివర్స్ అయింది. ఒకవేళ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడి ఉప ఎన్నికలు వస్తాయి. అందులో గెలిస్తే ఓకే .. గెలవకపోతే.. రేవంత్ రెడ్డి లేనిపోని తలనొప్పి. ఆయన పాలనకు రెఫరెండం అంటూ ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే ఆయనపై తిరుగుబాటు బావుటా ఎగరేసే అవకాశాలున్నాయి.

ఇదీ చదవండి:   గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!

ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..

మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల ఎలక్షన్స్ కూడా రేవంత్ రెడ్డి సర్కారకు అతిపెద్ద పరీక్ష. ఇందులో బీఆర్ఎస్ పోటీ చేయకపోవడంతో... కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారింది. ఇందులో కూడా ఒక్క సీటు ఓడిపోయినా.. అది రేవంత్ కు ఊహించని షాక్ అని చెప్పాలి. మొత్తంగా ఎమ్మెల్యేల అనర్హతతో పాటు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ రూపంలో రేవంత్ ముందు అతిపెద్ద సవాల్ ఎదురు కానుందని చెప్పాలి.

ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News