Chilukuru Balaji Temple: చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకుడిగా ఉన్న రంగరాజన్‌పై దాడి ఘటన రాజకీయంగా వేడెక్కిస్తోంది. పట్టపగలు 20 మంది ఇంటికెళ్లి దాడి చేయడం వెనుక కుట్రకోణం ఉందనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. వివిధ పార్టీ నేతల స్పందన కూడా సందేహాలకు బలం చేకూరుస్తోంది.
రామరాజ్య స్థాపన పేరుతో ఓ వ్యక్తి అనుచరగణాన్ని వెంటబెట్టుకుని తిరుగుతుండటం, కాదన్నవారిపై దాడులు చేయడంపై రాజకీయంగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఏమయ్యాయంటూ బీజేపీ, బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. దాడులకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ విన్పిస్తోంది. ఇప్పటికే ఈ ఘటనలో ఐదుగురిని అరెస్ట్ చేయగా మిగిలినవారికోసం గాలిస్తున్నారు. వీర రాఘవరెడ్డి అనే వ్యక్తి 20 మందితో కలిసి రామరాజ్యం స్థాపన పేరుతో రంగరాజన్‌ను కలిశాడు. ఆలయానికి వచ్చే భక్తుల్ని చేర్పించాలని కోరాడు. దీనికి రంగరాజన్ నిరాకరించడంతో ఆయనపై దాడికి పాల్పడ్డారు వీర రాఘవరెడ్డి సహా అతని అనుయాయులు. హిందూ ధర్మ పరిరక్షణలో ఇలాంటి కార్యక్రమాలు విరుద్ధమని రంగరాజన్ వాదించినట్టు తెలుస్తోంది. ఆయన తండ్రి సౌందర్య రాజన్ ఫిర్యాదు మేరకు పోలీసులు చర్యలకు ఉపక్రమించారు.
వీర రాఘవరెడ్డిపై గతంలో కూడా కేసులున్నాయని తెలిసింది. ఈ వ్యక్తి ఆంధ్రప్రదేశ్‌లోని అనపర్తికి చెందిన వ్యక్తి. గతంలో కూడా చాలా ఆలయాలకు, ప్రముఖ వ్యక్తుల్ని కలిసి రామరాజ్య స్థాపనకు కలిసి రావాలని కోరాడు. కాదన్నవారిపై దాడులు చేశాడు. తన వెంట వచ్చేవారికి వేతనాలు కూడా చెల్లిస్తానని వీర రాఘవరెడ్డి చెబుతుండటం విశేషం. మొత్తం వ్యవహారం చూస్తే ఈ దాడి యాధృఛ్ఛికంగా జరిగింది కాదని తెలుస్తోంది. మొత్తం దాడి వెనుక పెద్ద కుట్రే ఉందని పోలీసులు భావిస్తున్నారు.
బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, బీజేపీ నేత, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ తదితరులు ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలోని శాంతి భద్రతల పరిస్థితిని ఎండగట్టారు. బాధ్యుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
Also read: Gold Price Decline: పసిడి ప్రియులు ఆనందంతో షాక్, బంగారం ధర 50 వేలకు పడిపోతుందా ఎప్పటి నుంచి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి