Telangana Congress: అధికార కాంగ్రెస్ పార్టీలో ఏదో జరుగుతోందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. 14 నెలల పరిపాలనపై సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకతమవుతున్న వేళ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర స్థాయిలో విబేధాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్యేలు గ్రూపులు గ్రూపులుగా విడిపోయారు. కలిసి ఉన్నట్టు కనిపిస్తున్నా వేర్వేరు కుంపట్లు ఏర్పాటుచేసుకున్నారు.
ఈ క్రమంలోనే అనూహ్యంగా ఎవరికీ చెప్పాపెట్టకుండా రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనకు వస్తున్నారనే తీవ్ర సంచలనం రేపింది. పీసీసీకి సమాచారం లేకుండానే వరంగల్‌లో రాహుల్ గాంధీ సమావేశం కానున్నారనే వార్త కలకలం రేపింది. ఆకస్మికంగా ఉన్నఫళంగా రాహుల్ గాంధీ వరంగల్ పర్యటన చేపట్టారు. అనంతరం అనివార్య కారణాల రీత్యా రద్దయ్యింది. ఈ పరిణామాలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర సంచలనం రేపుతున్నాయి.
Also Read: Beer Price Hike: బీర్ ప్రియులకు గుదిబండ.. భారీగా ధరలు పెంచిన తెలంగాణ
ఆరు గ్యారంటీలతోపాటు డిక్లరేషన్‌ల పేరిట వివిధ వర్గాలకు ఇచ్చిన హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిన్నర అవుతున్నా నెరవేర్చలేదు. పరిపాలనలో పూర్తిగా విఫలమవడంతో సొంత పార్టీ నాయకుల నుంచే తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రేవంత్ రెడ్డి, అతడి సోదరులపై తీవ్ర అవినీతి, దందాల ఆరోపణలు వస్తున్నాయి. మంత్రివర్గ విస్తరణ చేపట్టకపోవడం.. పదవులు పంచకపోవడం.. ప్రాజెక్టులు, నిధుల విషయంలో కూడా అన్యాయం జరుగుతోందనే అభిప్రాయం ఎమ్మెల్యేల్లో వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే పది మంది ఎమ్మెల్యేలు పలుమార్లు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తిరుగుబాటు మొదలవుతుందనే ప్రచారం తీవ్రమవడంతో వెంటనే రంగంలోకి దిగిన అధిష్టానం వెంటనే సీఎల్పీ సమావేశం నిర్వహించి ఎమ్మెల్యేలను బుజ్జగించారు.
Also Read: Indiramma Indlu: తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త.. ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక ఫ్రీ
ఈ పరిణామం అనంతరం ఢిల్లీ పర్యటన చేపట్టిన రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులకు అధిష్టానం కలిసేందుకు నిరాకరించినట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్ ఇవ్వలేదనే వార్త హాట్ టాపిక్‌గా మారింది. కొన్ని నెలల నుంచి రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని పట్టించుకోవడం లేదని ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాలు జరిగిన కొన్ని రోజులకే రాహుల్ గాంధీ ఉన్నఫళంగా తెలంగాణలో ఆకస్మిక పర్యటన చేపట్టడం కలకలం రేపింది.
ఎందుకు పర్యటన?
కనీసం పీసీసీకి కూడా సమాచారం ఇవ్వకుండా వరంగల్ పర్యటనకు సిద్ధమవడంపై తెలంగాణ కాంగ్రెస్‌లో సంచలనం సృష్టించింది. రాహుల్ గాంధీ ఎందుకు పర్యటన చేయాలనుకున్నారు? అధిష్టానం తెలంగాణపై ఎలాంటి వైఖరి ఉంది? వరంగల్‌కు రాహుల్ గాంధీని ఎవరు పిలిపించారనే అనే చర్చ జరుగుతోంది. రాహుల్ ఆకస్మిక పర్యటన వార్తలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. దీని పర్యవసానం ఏం ఉండనుందో అనే ఉత్కంఠ తెలంగాణ కాంగ్రెస్‌లో నెలకొంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter