Election Survey 2025: ప్రస్తుతం దేశంలో బీజేపీ సారధ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలో ఉంది. నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రధానిగా బాధ్యతల స్వీకరించారు. మరో రెండు నెలలైతే దేశంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ఏడాది పూర్తవుతుంది. ఈ నేపధ్యంలో దేశంలో ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారు, మూడ్ ఎలా ఉందనే అంశంపై ఇండియా టుడే సీ ఓటర్ నిర్వహించి మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో షాకింగ్ ఫలితాలు వెలుగు చూశాయి. దేశంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మరోసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అధికారంలో వస్తుందని తేలింది. మొన్నటి ఎన్నికల్లో వచ్చినట్టు బొటాబొటీ మెజార్టీ కాకుండా మంచి మెజార్టీ లభిస్తుందని స్పష్టమైంది.
కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కావల్సిన మ్యాజిక్ ఫిగర్ 272 సీట్లు. ప్రస్తుతం ఎన్డీయేకు 284 స్థానాలే ఉన్నాయి. ఇస్ బార్ చార్ సౌ పార్ అంటూ బరిలో దిగిన బీజేపీ కేవలం 240 సీట్లకే పరిమితమైంది. కాంగ్రెస్ పార్టీ 232 సీట్లు గెల్చుకుంది. ఇండియా టుడే సీ ఓటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఒపీనియన్ పోల్ అంచనా వేసింది. ఇప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ సారధ్యంలోని ఇండియా కూటమి 188 స్థానాలకు పడిపోనుంది. అటు బీజేపీ 281 సీట్లు సాధిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా 78 స్థానాల్లో విజయం సాధించవచ్చు.
2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా 99 సీట్లు సాధించగా ఇప్పుడు 78కు పడిపోనుంది. బీజేపీ మాత్రం ఏకంగా 40 సీట్లు పైగా పుంజుకోవచ్చు. దేశవ్యాప్తంగా అన్ని లోక్‌సభ నియోజకవర్గాల నుంచి 1,25,123 మంది ఓటర్ల అభిప్రాయాలు సేకరించారు. జనవరి 2వ తేదీ నుంచి ఫిబ్రవరి 9 వరకూ సేకరించిన అభిప్రాయాలివి. వాస్తవానికి 2024 ఎన్నికల్లో బీజేపీ అంతగా రాణించలేకపోయినా ఆ తరువాత వివిధ రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పుంజుకుంది. మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించింది. ఈ పరిణామాలో ఇప్పటికిప్పుడు దేశంలో ఎన్నికలు జరిగితే బీజేపీ మరోసారి అధికారం ఖాయమంటోంది ఈ సర్వే.
Also read: 8th pay Commission Gift: ఉద్యోగులకు ఊహించని గిఫ్ట్, ఆ ఉద్యోగులకు జీతం లక్ష దాటుతుంది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి