PM US Tour: మోదీ ముందే భారత్ కు ట్రంప్ టారిఫ్ వార్నింగ్.. భారత ప్రధానికి పెద్దన్న ఇచ్చిన గిఫ్ట్ ఇదే..

PM US Tour Trump Sensational Comments: భారత ప్రధాని నరేంద్ర మోదీ యూఎస్‌ పర్యటనలో భాగంగా నిన్న గురువారం అగ్రరాజ్యాధినేత డోనాల్డ్‌ ట్రంప్‌ను కలిశారు. ట్రంప్‌ రెండోసారి విజయం తర్వాత  మోదీ మొదటిసారి సమావేశం అయ్యారు. భారత్‌తో తనక ప్రత్యేక అనుబంధం ఉందని చెప్పారు ట్రంప్‌. అంతకు ముందే ఎలాన్‌ మస్క్‌ను కూడా కలిశారు ప్రధాని. అయితే మోదీని కలిసిన కొద్దిసేపటికే రిసిప్రోకల్‌ ట్యారీఫ్‌ను కూడా ప్రకటించారు ట్రంప్‌.

Written by - Renuka Godugu | Last Updated : Feb 14, 2025, 08:49 AM IST
PM US Tour: మోదీ ముందే భారత్ కు ట్రంప్ టారిఫ్ వార్నింగ్.. భారత ప్రధానికి పెద్దన్న ఇచ్చిన గిఫ్ట్ ఇదే..

PM US Tour Trump Sensational Comments: దేశప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌ విధిస్తున్న టారిఫ్‌లపై మాట్లాడారు. భారత్‌ విధిస్తున్న టారిఫ్‌లపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అధిక టారిఫ్‌లు వాణిజ్యానికి అడ్డంకిగా మారుతున్నాయి, భారత్‌లో వస్తువుల విక్రయాలు కష్టమవుతుందని ప్రపంచంలో అధిక టారిఫ్స్‌ విధించే దేశం భారత్‌ అని చెప్పుకొచ్చారు. అందుకే మేము కూడా అదే పద్ధతిని పాటిస్తాం మేము అంతే ఛార్జ్‌ చేస్తామని ట్రంప్‌ స్పష్టం చేశారు.

రెసిప్రోకల్‌ సుంకాలు..
ఇతర దేశాల నుంచి రెసిప్రోకల్‌ సుంకాలను వసూలు చేస్తామని నిర్ణయించినట్లు అమెరికా అధ్యక్షుడు ప్రకటించారు. అయితే రిపోర్టర్స్‌ వాణిజ్యం విషయంలో భారత్‌తో కఠినంగా వ్యవహరిస్తే చైనాతో ఎలా పోరాడుతారని ప్రశ్నించగా.. యూఎస్‌ఏ దేశన్నైనా ఓడించే స్థితిలో ఉందని ట్రంప్‌ అన్నారు. కానీ, ఎవరినీ ఓడించాలని అనుకోవడం లేదన అన్నారు. 

మోదీకి ఇచ్చిన గిఫ్ట్‌ ఇదే..
అమెరికా పర్యటనలో ఉన్న దేశ ప్రధాని నరేంద్ర మోదీకి 'Our Journey Together'  అనే బుక్‌ గిఫ్ట్‌గా అందజేశారు. ఈ బుక్‌పై ఆయన మిస్టర్‌ ప్రైమ్‌ మినిస్టర్ యూ ఆర్‌ గ్రేట్‌ అని సంతకం చేసి ఇచ్చారు. భారత్‌లో పర్యటించిన ఫోటోలను పొందుపరిచారు. 

భారత్‌ది ఎప్పుడూ శాంతి పక్షమే: మోదీ
అమెరికా పర్యటనలో భాగంగా రష్యా,ఉక్రెయిన్‌ యుద్ధం విషయంలో భారత్‌ తటస్థంగా ఉందని ప్రపంచం అనుకుంటుందని ప్రధాని అన్నారు. పుతిన్‌, ట్రంప్‌ చర్చలు జరపడం ఆనందంగా ఉందన్నారు.

ఇక ప్రధాని మోదీ గ్రేట్‌ లీడర్‌ అని యూఎస్‌ అధ్యక్షుడు ట్రంప్‌ కొనియాడారు. మోదీ కూడా మిమ్మల్ని వైట్‌హౌస్‌లో చూడటం ఆనందంగా ఉందన్నారు. మీ చారిత్రాత్మక విజయానికి అభినందనలు అన్నారు. 

ముంబై ఉగ్రదాడి నిందితుడిని భారత్‌కు అప్పగిస్తాం అని అమెరికా అధ్యక్షుడు ప్రకటించాడు. ముంబై ఉగ్రదాడి (2008) కుట్రదారుల్లో ఒకరైన తహవ్వూర్‌ హుస్సేన్‌ను ప్రపంచంలో అత్యంత దుర్మార్గు్లో ఒకడని చప్పారు. అతడిని న్యాయ విచారణ కోసం ఇండియాకు పంపడానికి హ్యాపీగా ఉందన్నారు. దీంతో ట్రంప్‌కు మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు 

 

 

'బంగ్లాదేశ్‌ను మోదీకే వదిలేస్తున్నా'..
బంగ్లాదేశ్‌ వ్యవహారంలో అమెరికా తలదూర్చదని అగ్రరాజ్యాధినేత ప్రకటించాడు. ఆ విషయం మోదీకే వదిలేస్తున్నామని ప్రకటించారు. ఆ దేశానికి ఇండియాతో ఎన్నో ఏళ్లుగా సంబంధం ఉంది అన్నారు. కానీ, ఈ విషయంపై మోదీ స్పందించలేదు.

అక్రమ వలసదారుల అంశంపై మోదీ మాట్లాడారు. ఇతర దేశాల్లో అక్రమంగా నివసించే వారికి అక్కడ ఉండే హక్కు లేదు.. భారతీయులు ఎవరైనా సరే యూఎస్‌లో అక్రమంగా ఉంటే వెనక్కి తీసుకురావడానికి తాము సిద్ధమే అన్నారు చాలామంది ఏజెంట్‌ మోసాల నేపథ్యంలో అక్కడికి వెళ్తున్నారన్నారు. 

మస్క్‌తో మోదీ భేటీ..
అమెరికా పర్యటనలో భాగంగా మోదీ బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌ను కలిశారు. మోదీ బస చేసిన వాషింగ్టన్‌ డీసీలోని బ్లెయిర్‌ హౌస్‌లో కుటుంబంతోపాటు మస్క్‌ మోదీతో భేటీ అయ్యారు. స్పేస్‌, మొబిలిటీ, టెక్నాలజీ, ఇన్నోవేషన్‌ వంటి అంశాలపై చర్చించినట్లు మోదీ ట్వీట్‌ చేశారు.

 

 

 

ఇదీ చదవండి: పీఎం కిసాన్‌ యోజనలో రూ.2000 పొందేందుకు మీరు అర్హులా? ఎలిజిబిలిటీ చెక్‌ చేయండి..  

ఇదీ చదవండి: తిరుమల వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్‌.. పర్యాటక శాఖ ద్వారా శ్రీవారి దర్శనాలు..  

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

 

 

Trending News