Delhi Stampede: ఆ వదంతే 18 మంది ప్రాణాలు తీసిందా? ఢిల్లీ రైల్వేస్టేషన్‌ తొక్కిసలాట వీడియో 

Delhi Stampede Update: దేశ రాజధాని న్యూఢిల్లీలో ఘోరం చోటుచేసుకుంది. కుంభమేళాకు వెళ్తున్న భక్తులతో ఒక్కసారిగా రైల్వే స్టేషన్లో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 18 మంది భక్తులు చనిపోయారు. 30 మందికి పైగా గాయాలైనట్లు తెలుస్తోంది. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం

Written by - Renuka Godugu | Last Updated : Feb 16, 2025, 06:27 AM IST
Delhi Stampede: ఆ వదంతే 18 మంది ప్రాణాలు తీసిందా? ఢిల్లీ రైల్వేస్టేషన్‌ తొక్కిసలాట వీడియో 

 Delhi Stampede Update: కుంభమేళా వెళ్తున్న భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతుంది. ఈ నేపథ్యంలో కొన్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రద్దీ పెరగడంతో ఢిల్లీ రైల్వేస్టేషన్లో శనివారం రాత్రి తొక్కిసలాట చోటుచేసుకుంది. ఇందులో 18 మంది మృతి చెందినట్లు జయప్రకాష్ ఆసుపత్రి ప్రకటించింది. ముఖ్యంగా ఇందులో 11 మంది మహిళలు, 4 చిన్నారులు ఉన్నారు. వీరంతా కుంభమేళాకు వెళ్లే భక్తులు. అయితే, రైల్వే స్టేషన్‌లో ఒక్కసారిగా ఎక్కువ మంది భక్తులు చేరడంతో తొక్కిసలాట జరిగింది. ప్రయాగ రాజ్ వెళ్లే రైళ్లు  రద్దయిందనే వదంతే కారణమని సమాచారం.. ఈ తొక్కిసలాట ఘటనపై అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టాలని కేంద్రం ఆదేశించింది.

శనివారం రాత్రి జరిగిన ఈ తొక్కి సలాట ఘటన ఢిల్లీలోని  రైల్వే స్టేషన్లో జరిగింది. వీరంతా ప్రయాగ రాజ్‌కు బయలుదేరడానికి రైల్వే స్టేషన్ వచ్చారు. అయితే పెద్ద సంఖ్యలో ఒక్కసారిగా భక్తులు రైల్వే స్టేషన్ కి రావడంతో 14, 16 నెంబర్ ప్లాట్ ఫామ్‌పై ప్రయాణీకుల సంఖ్య పెరిగింది ఈ నేపథ్యంలోనే తొక్కిసలాట జరిగింది. ఘటన జరిగిన వెంటనే ఆ ప్రాంతానికి చేరుకున్న సహాయక బృందాలు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఇక గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ తొక్కిసలాట ఘటనపై రైల్వే శాఖ కూడా దర్యాప్తుకు ఆదేశించింది.

ఇదీ చదవండి: తిరుమల వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్‌.. పర్యాటక శాఖ ద్వారా శ్రీవారి దర్శనాలు..  

ప్రధానంగా ప్రయాగ్‌ రాజ్‌కు ఎక్కువ శాతం ప్రయాణీకులు వెళ్లడంతో రైళ్లపై దాడులు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మరణాలు కూడా చోటు చేసుకుంటున్నాయి అని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. రద్దీని నివారించేందుకే రైళ్లను కూడా పెంచామని రైల్వే మంత్రిత్వ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ తెలిపారు. అయినా కానీ ఇలాంటి అరదైన ఘటనలు చేసుకుంటున్నట్లు తెలిపారు. పలు రైళ్లు ఆలస్యం అవ్వడంతో ఆ ప్రయాణికులు.. ప్రయాగ్‌ రాజ్‌ వెళ్లే ప్రయాణికులు ఒక్కసారిగా ప్లాట్ ఫామ్ పైకి రావడంతో ఇలా తొక్కిసలాట జరిగిందని తెలుస్తోంది. 

ఇదీ చదవండి: బొప్పాయి నిమ్మరసం ప్రతిరోజు తీసుకుంటే మీ శరీరంలో జరిగే మార్పు ఇదే..

 

 

 

ఇక గత నెలలో కూడా మౌనీ అమావాస్యనాడు ఇలాంటి అరుదైన తొక్కిసలాట ఘటనే చోటుచేసుకుంది ఈ ఘటనలో కుంభమేళలో 30 మంది భక్తులు చనిపోయారు. పదుల సంఖ్యలో తీవ్ర గాయాల పాలయ్యారు. కుంభమేళకు వెళ్తున్న భక్తుల సంఖ్య నానాటికి పెరిగిపోతుంది. ఇప్పటికే 50 కోట్లకు మందికి పైగా భక్తులు కుంభమేళాలో పవిత్ర స్నానం ఆచరించారు. ఈ నేపథ్యంలో ఆ చుట్టూ పక్కల ప్రాంతాలు దాదాపు 350 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయిన సంగతి కూడా తెలిసిందే. 

 

 

ఇక మరోవైపు ఢిల్లీ రైల్వేస్టేషన్ తొక్కేసేలాట విషయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే తీవ్రంగా మండిపడ్డారు. ఈ ఘటన చాలా బాధాకరం జవాబుదారీతనం ఉండాలి.. ఎంతమంది చనిపోయారో క్షతగాత్రులు ఎందరో వివరాలన్నీ కేంద్రం వెంటనే బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

  

Trending News