Govt Holiday: రేపు ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు.. ఉత్తర్వులు వెలువరించిన ప్రభుత్వం

Two Day Holidays For Govt Employees: ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ప్రభుత్వ ఉద్యోగులకు రేపు సెలవు దక్కింది. ఫిబ్రవరి 15వ తేదీన సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే అందరూ ప్రభుత్వ ఉద్యోగులకు కాకుండా కొందరికి మాత్రమే సెలవు ప్రకటించింది.

1 /5

ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వ శుభవార్త తెలిపింది. రేపు సెలవు ఇస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. శనివారం సెలవు ఇచ్చింది. శనివారం సెలవుతోపాటు ఆదివారం కూడా సెలవు కలవడంతో ప్రభుత్వ ఉద్యోగులకు జాక్‌పాట్‌ తగిలింది. వరుసగా రెండు రోజులు సెలవు రావడంతో ప్రభుత్వ ఉద్యోగుల్లో హర్షం వ్యక్తమవుతోంది.

2 /5

సెలవు అందరూ ఉద్యోగులకు కాకుండా కొందరికి మాత్రమే సెలవు ప్రకటించడం గమనార్హం. ప్రభుత్వ విభాగంలో పని చేసే బంజారా ఉద్యోగులకు మాత్రమే సెలవు ఇస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో వెల్లడించింది.

3 /5

సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకలు చేసుకునేందుకు 15.02.2025న స్పెషల్ క్యాజువల్ లీవ్ వర్తిస్తుందని ప్రభుత్వం వెల్లడించింది. శనివారం సెలవు లభించడంతో బంజారా ఉద్యోగులు సంత్‌ సేవాలాల్‌ జయంతి ఉత్సవాల్లో పాల్గొననున్నారు.

4 /5

గిరిజన వర్గం సంత్ సేవాలాల్ మహరాజ్ దేవుడిగా కొలుస్తుంది. తమ జాతి గౌరవంగా.. తమ ఆత్మగౌరవంగా సంత్‌ సేవాలాల్‌ను గిరిజనులు పరిగణిస్తున్నారు. నాటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతిని అధికారిక కార్యక్రమంగా ప్రారంభించారు.

5 /5

సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు ప్రకటించగా.. విద్యాసంస్థలకు ప్రకటించకపోవడంతో విద్యార్థులు నిరాశకు గురయ్యారు. ప్రభుత్వ ఉద్యోగులకు, విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాలనే డిమాండ్‌ వచ్చినా కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు.