Daaku Maharaaj OTT: టాలీవుడ్ సీనియర్ టాప్ స్టార్ బాలయ్య మంచి దూకుడు మీదున్నారు. ఈ యేడాది ‘డాకు మహారాజ్’ సినిమాతో మరో సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్నారు. ఈ సినిమా బాలకృష్ణ కెరీర్ లో బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. త్వరలో ఓటీటీలో స్ట్రీమింగ్ కు రానుంది. అయితే.. మేకర్స్ ఓటీటీలో ఆడియన్స్ ను మరో సర్ప్రైజ్ ఇవ్వనున్నారట.
Daaku Maharaaj OTT: ‘అఖండ’, ‘వీరసింహారెడ్డి’, ‘భగవంత్ కేసరి’ సినిమాల తర్వాత తాజాగా ‘డాకు మహారాజ్’ చిత్రంతో వరుసగా నాల్గో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు బాలయ్య. ఈ సినిమా బాక్సాఫీస్ మంచి వసూళ్లతో బాలయ్య కెరీర్ లోనే ఎక్కువ వసూళ్లను సాధించిన చిత్రంగా నిలిచిపోయింది.
ఇప్పటికే థియేట్రికల్ రన్ ముగిసిన ఈ సినిమా త్వరలో ఓటీటీలో స్ట్రీమింగ్ కు రానుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా రైట్స్ దక్కించుకుంది. అయితే.. ఈ నెల 14 నుంచి ఈ సినిమా ఓటీటీలోకి రావాల్సింది కానీ నెట్ ఫ్లిక్స్ సంస్థకు ‘డాకు మహారాజ్’ మూవీకి సంబంధించి హిందీ, మలయాళ, కన్నడ వెర్షన్స్ రాకపోవడంతో స్ట్రీమింగ్ ఆలస్యమవుతోంది. నెట్ ఫ్లిక్స్ దాదాపు రూ. 50 కోట్లకు ఐదు భాషలకు చెందిన స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకుంది.
ఇక నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో డాకు మహారాజ్ లో సినిమాలో చూపెట్టని సన్నివేశాలతో కలిపి స్ట్రీమింగ్ కు తీసుకురానున్నారట. ఒక వేళ థియేటర్స్ లో సినిమా చూసినవాళ్లకు అదనంగా కొన్ని సన్నివేశాలను యాడ్ చేసి స్ట్రీమింగ్ కు తీసుకురానున్నారు. మరో రెండు మూడు రోజుల్లో ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు రానుంది.
బాలయ్య విషయానికొస్తే.. ఈయన వరుస విజయాలతో జైత్రయాత్ర చేస్తున్నాడు. తాజాగా ‘డాకు మహారాజ్’ మూవీతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. మరోవైపు ఈ యేడాది కేంద్రం పద్మభూషణ్ కూడా ప్రకటించడంతో బాలయ్య అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు.
‘డాకు మహారాజ్’ మూవీ విడుదలైన నాలుగు రోజుల్లో రూ. 100 కోట్ల క్లబ్బుల్లో ప్రవేశించింది. ఇప్పటి వరకు అన్ని భాషల్లో కలిపి రూ. 90 కోట్ల షేర్ (రూ. 167 కోట్ల గ్రాస్) వసూళ్లను సాధించినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
‘డాకు మహారాజ్’ సోలో హీరోగా నాల్గో రూ.100 కోట్ల గ్రాస్ సినిమా. అఖండతో ఫస్ట్ టైమ్ రూ. 100 కోట్ల గ్రాస్ క్లబ్బులో ప్రవేశించిన బాలయ్య.. ఆ తర్వాత వీరసింహారెడ్డి’, ‘భగవంత్ కేసరి’, తాజాగా ‘డాకు మహారాజ్’ చిత్రాలతో వరుసగా నాలుగు వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో ప్రవేశించిన హీరోగా రికార్డు క్రియేట్ చేసాడు. అంతేకాదు యూఎస్ లో వరుసగా నాలుగు వన్ మిలియన్ డాలర్స్ కొల్లగొట్టిన సీనియర్ టాలీవుడ్ హీరోగా రికార్డు క్రియేట్ చేసారు.
ఇక బాలకృష్ణ 60 యేళ్ల పై బడిన వయసులో వరుసగా నాలుగు వరుస సక్సెస్ లు అందుకున్నారు. అంతేకాదు కంటిన్యూగా నాలుగు రూ. 100 కోట్ల గ్రాస్ అందుకున్నసీనియర్ టాప్ స్టార్ గా రికార్డు క్రియేట్ చేసారు. యూఎస్ లో వరుసగా నాలుగు వన్ మిలియన్ యూఎస్ డాలర్స్ కలెక్ట్ చేసిన సీనియర్ హీరో కూడా ఎవరు లేరు. ఈ రేంజ్ సక్సెస్ రేట్ ఉన్న సీనియర్ స్టార్ భారత దేశంలో ఎవరు లేరు. ఒక రకంగా బాలయ్య ‘డాకు మహారాజ్’ తో ప్రపంచ రికార్డు క్రియేట్ చేసారు.