మూవీ రివ్యూ: తల (Thala)
నటీనటులు: అమ్మ రాగిన్ రాజ్, అంకిత నస్కర్, రోహిత్, ఎస్తేర్ నోరోన్హ, ముక్కు అవినాశ్, సత్యం రాజేశ్, అజయ్, విజ్జి చంద్రశేఖర్, రాజీవ్ కనకాల, ఇంద్రజ, శ్రవణ్
సంగీతం: ధర్మ తేజ, అస్లాం కేఈ
సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె నాయుడు
ఎడిటర్: శివ సామి
డైలాగ్స్: అమ్మ రాజశేఖర్ అండ్ టీం
బ్యానర్: దీపా ఆర్ట్స్
నిర్మాత: శ్రీనివాస గౌడ్
కొరియోగ్రఫీ, దర్శకత్వం: అమ్మ రాజశేఖర్
విడుదల తేది: 14-2-2025
దీప ఆర్ట్స్ బ్యానర్ పై ఫేమస్ కొరియోగ్రాఫర్ కమ్ దర్శకుడు అమ్మ రాజశేఖర్ డైరెక్షన్ లో ఆయన కుమారుడు అమ్మ రాగిన్ రాజ్ హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన చిత్రం ‘తల’. అంకిత నస్కర్ కథానాయికగా నటించింది. ఇప్పటికే టీజర్, ట్రైలర్ తో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. తాజాగా ఈ చిత్రాన్ని ప్రేమికుల దినోత్సవమైన వాలంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14వ తేదీ (ఈ రోజు)న విడుదలైంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
కథ విషయాని కుస్తే..
తన తల్లి ప్రేమించిన వ్యక్తికి దూరమై కాలం వెళ్లదీస్తూ ఉంటుంది. అలా అనారోగ్యం బారిన పడిన అమ్మ.. తన కుమారుడిని పిలిచి అతని తండ్రి గురించి చెబుతుంది. వాళ్లు ఎలా విడిపోయామన్నది చెబుతోంది. దీంతో తన తండ్రి కలవాడినికి హీరో (అమ్మ రాగిన్ రాజ్) బయలు దేరుతాడు. ఈ క్రమంలో అప్పటికే వేరే పెళ్లి చేసుకున్న అతని తండ్రి కుటుంబానికి తానెవరో చెప్పకుండా దగ్గరవుతాడు. అదే సందర్బంలో హీరోకు ఓ అమ్మాయితో పరిచయం ఏర్పడుతుంది. అది ప్రేమగా మారుతుంది. అయితే అనుకోకుండా హీరో తండ్రి ఫ్యామిలీలో ఏదో సమస్య వచ్చి పడుతుంది. ? ఆ సమస్యను హీరో ఎలా పరిష్కరించాడు. చివరకు దూరమైన తల్లిదండ్రులను అతను కలిపాడా.. ? ఈ మజిలిలో వారి లైఫ్ ఎలాంటి టర్న్ తీసుకుందనే ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే ‘తల’ మూవీ చూడాల్సిందే.
కథనం, టెక్నికల్ విషయాలకొస్తే..
ఏ సినిమాకైనా కథే బలం. ఈ చిత్రానికి కూడా స్టోరీ మెయిన్ పిల్లర్ అని చెప్పుకోవాలి. ఎంత మంచి కథనైనా సరైన విధంగా చెప్పకపోతే అది వృథానే అని చెప్పాలి. కానీ అమ్మ రాజశేఖర్ మాత్రం తాను ఎంచుకున్న సబ్జెక్ట్ ను అంత పకడ్బందీగా తెరకెక్కించాడు. అంతేకాదు లేట్ గా మళ్లీ మెగా ఫోన్ పట్టుకున్నా.. తనలో ఫైర్ తగ్గలేదనే విషయం మరోసారి ప్రూవ్ అయింది. మొత్తంగా అమ్మ అనే పేరును తన పేరు ముందు పెట్టుకున్న అమ్మ రాజశేఖర్.. అదే అమ్మ సెంటిమెంట్ ను ప్రేక్షకులను సీట్లలో కదలనీయకుండా చేసాడు. మంచి సెంటిమెంట్ తో కూడిన యాక్షన్ డ్రామాగా మలచడంలో సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా అమ్మాయి కోసం ప్రాణాలు ఇస్తున్న ఈ రోజుల్లో అమ్మ కోసం కష్టపడే కుమారుడి స్టోరీనే తనదైన యాక్షన్ కమ్ ఫ్యామిలీ డ్రామా మలచడంలో దర్శకుడిగా అమ్మ రాజశేఖర్ సక్సెస్ అయ్యారు. అంతేకాదు 24 క్రాఫ్ట్స్ ను ఎక్కడ ఏ మేరకు ఏ మోతాదులో ఎలా వాడుకోవాలో అమ్మ రాజశేఖర్ ‘తల’ సినిమా కోసం వాడిన విధానం చూస్తే మెచ్చుకోవాల్సిందే.
ముఖ్యంగా ఎంత మంచి కథ అయినా.. ఏ సీన్ తర్వాత ఏ సీన్ రావాలన్న విషయంలో కొంత మంది దర్శకులు తడబడుతున్నారు. కానీ అమ్మ రాజశేఖర్ ఈ సినిమాను షార్ట్ అండ్ స్వీట్ గా ఒక పద్దతి ప్రకారం ఈ సినిమా స్క్రీన్ ప్లే రాసుకున్నాడు. ప్రేక్షకులకు కన్వ్యూజ్ చేయకుండా ఎక్కడ తడబడకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. అంతేకాదు తన కుమారుడితో ఓ కొరియోగ్రాఫర్ గా మంచి స్టెప్పులు వేయించాడు. మరోవైపు ఫస్ట్ మూవీ అయినా.. తన కుమారుడితో ఫారెస్ట్ లో తీసిన ఫైట్ సీన్స్ బడా స్టారోస్ చేసే లెవల్లో ఉన్నాయి. ముఖ్యంగా ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది. తర్వాత ఏం జరుగుతుందనే కుతూహలం ప్రేక్షకుల్లో కలిగేలా చేసాడు. శ్యాం కే నాయుడు ఫోటోగ్రఫీ బాగుంది. ముఖ్యంగా యాక్షన్, ఎమోషన్ సీన్స్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పెద్ద ఎస్సెట్ గా నిలిచింది. అక్కడక్కడ ఆర్ఆర్ తడబట్టు కనబడ్డా ఓవరాల్ గా బాగుంది. ఇంకాస్త బెటర్ గా ఇవ్వొచ్చని చెప్పొచ్చు. ఎడిటర్ శివసామి ప్రేక్షకులకు ఏది కావాలో అదే తెరపై చూపించాడు. అక్కడ కొన్ని సీన్స్ ఉన్నా.. దాదాపు 90 శాతం ప్రేక్షకులు బోర్ కొట్టించకుండా ఎడిటింగ్ చేసాడు. గ్రాఫిక్స్ వర్క్ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఇదీ చదవండి: అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే..
మొత్తంగా తానే కొరియోగ్రాఫర్ గా, దర్శకుడిగా తన తనయుడు అమ్మ రాగిన్ రాజ్ ను చిత్ర పరిశ్రమకు ఇలాంటి సబ్జెక్ట్ తో పరిచయం చేయడం బాగుంది. ఈ సినిమాతో దర్శకుడిగా తన పవర్ తగ్గలేదనే విషయం మరోసారి ప్రూవ్ అయింది. ఈ సినిమాలోని చాలా సీన్స్ ను ఉత్తర ప్రదేశ్ లోని రియల్ లొకేషన్స్ లో తీయడం కొత్త విషయంగా చెప్పుకోవాలి.
నటీనటుల నటన:
అమ్మ రాజశేఖర్ తనయుడు అమ్మ రాగిన్ రాజ్ తొలి చిత్రం కావడంతో ముందుగా అతని యాక్టింగ్ గురించి మాట్లాడుకోవాలి. మొదటి చిత్రమైనప్పటికీ ఎక్కడ కూడా కొత్తగా వచ్చిన యాక్టర్ కాకుండా ఎంతో అనుభవం ఉన్న నటుడిగా మెప్పించాడు. ప్రతి సీన్, ప్రతి ఎమోషన్ ఎంతో స్పష్టంగా తనదైన శైలిలో మెప్పించాడు. అంతేకాదు స్టార్ హీరో మెటీరియల్ అని చెప్పాలి. రాగిన్ రాజ్ కు జోడిగా నటించిన అంకిత అద్భుతమైన పర్ఫామెన్స్ ఇచ్చారు. అదేవిధంగా ఎంతోకాలం తర్వాత తెరపైకి వచ్చిన 6 టీన్స్ ఫేమ్ రోహిత్ తన తండ్రి పాత్రలో నటిస్తూ ఆ పాత్రకు ప్రాణ ప్రతిష్ఠ చేశాడు. అదేవిధంగా ఎస్తేర్ నోరోన్హా తన పాత పరిధిలో ఎప్పుడూ గ్లామర్ గా కనిపించే ఈమె ఈ చిత్రంలో తల్లి సెంటిమెంట తో మెప్పించింది. ఇక తల్లి పాత్రలో నటించిన ‘రాధా రాజశేఖర్’ తనదైన విలనిజాన్ని పండించింది. అజయ్ నిడివి తక్కువైన తన పాత్రకు న్యాయం చేసాడు.ముఖ్యంగా సత్యం రాజేష్ నిజాయితీగల కానిస్టేబుల్ పాత్రలో అతని నటన ఆకట్టుకుంది. ముఖ్యంగా కుటుంబ విలువలు, నీతి, నిజాయితీ, మంచి కోసం తపించే ఫ్యామిలీ. ముఖ్యంగా విజ్జి చంద్రశేఖర్ నెగిటివ్ పాత్రలో అద్భుతంగా నటించారు. ముక్కు అవినాష్, రాజీవ్ కనకాల, ఇంద్రజ వంటి వారు ఈ చిత్రానికి బ్యాక్ బోన్ గా నిలిచారు.
ప్లస్ పాయింట్స్:
కథ, దర్శకత్వం,
నటీనటుల నటన,
చిత్ర నడివి
నిర్మాణ విలువలు , ఫోటోగ్రఫీ
మైనస్ పాయింట్స్:
బ్యాగ్రౌండ్ మ్యూజిక్
వైలెన్స్ ఎక్కువగా ఉండటం
పంచ్ లైన్ .. ‘తల’ .. హృదయాలను హత్తుకునే అమ్మ సెంటిమెంట్ కథ
రేటింగ్: 3/5
ఇదీ చదవండి: తాగుడుకు బానిసై సినీ కెరీర్ నాశనం.. 44 ఏళ్ల వయసులో స్టార్ హీరోయిన్ రెండో పెళ్లి..
ఇదీ చదవండి: వై టార్గెట్ చిరంజీవి.. ? మెగా ఫ్యామిలీని కావాలనే టార్గెట్ చేశారా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.