PF Interest Rate: పీఎఫ్‌ ఖాతాదారులకు జాక్‌పాట్‌.. డిపాజిట్లపై భారీగా వడ్డీ రేటు

EPFO Likely To Retain PF Interest Rate Above 8 Percent: పీఎఫ్‌ పొందే వినియోగదారులకు భారీ శుభవార్త. పీఎఫ్‌ వడ్డీ రేటు భారీగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. రాబోయే ఆర్థిక సంవత్సరంలో పీఎఫ్‌ వడ్డీ రేటుపై కమిటీ సమావేశమై త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పీఎఫ్‌ వడ్డీ రేటు ఎంత ఉంటుందో తెలుసుకోండి.

1 /5

ఉద్యోగుల ప్రావిడెంట్‌ ఫండ్‌ విషయంలో ఈపీఎఫ్‌ఓ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పీఎఫ్‌కు సంబంధించిన వడ్డీ రేటు విషయంలో కమిటీ సమాలోచనలు చేస్తోంది. వడ్డీ రేటు ఎంత ఉండాలో త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

2 /5

వడ్డీ రేటును 8 శాతంపైనే ఈపీఎఫ్‌ఓ తీసుకుంటుందనే వార్తలు వస్తున్నాయి. సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ ట్రస్టీస్‌ (సీబీటీ) సమావేశంలో పీఎఫ్‌ డిపాజిట్ల వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకుంటారు.

3 /5

పీఎఫ్‌ డిపాజిట్లపై వడ్డీ రేటును 8 శాతంపైనే.. దానికంటే పావు శాతం ఎక్కువ చేసి 8.25 శాతంగా వడ్డీ రేటు ఉంచేలా వార్తలు వస్తున్నాయి. ఈ ఫిబ్రవరి 28వ తేదీన వడ్డీ రేటును ప్రకటించనున్నారు.

4 /5

వడ్డీ రేటు విషయంలో ఈపీఎఫ్‌ఓ, సీబీటీ తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదించాల్సి ఉంది. కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం అనంతరం వడ్డీ రేటును పీఎపీఎఫ్‌ఓ చందాదారుల ఖాతాలకు సమాచారం ఇవ్వడం.. జమ చేయడం జరుగుతాయి.

5 /5

ఈపీఎఫ్‌ఓలో 65 లక్షల మందికి పైగా చందాదారులు ఉన్నారు. ఈ సంస్థ 2023-24లో రూ.1,07,000 కోట్ల ఆదాయంపై 8.25 శాతం వడ్డీని అందించింది. 2022-23లో రూ.91,151.66 కోట్ల ఆదాయంపై 8.15 శాతం వడ్డీ ఇచ్చింది. అత్యల్పంగా 2002-03లో ఈపీఎఫ్‌ఓ 9.50 శాతం వడ్డీ రేటును అందించింది.