Telangana Congress in-charge: దేశంలోని పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కాంగ్రెస్ పార్టీ కొత్త ఇంచార్జీలను నియమించింది. తెలంగాణలో పార్టీ వ్యవహారాల ఇంచార్జీగా మాజీ ఎంపీ మీనాక్షి నటరాజన్ ను నియమించింది కాంగ్రెస్ అధిష్టానం. నటరాజన్ రాహుల్ గాంధీ టీమ్ లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. అలాగే హిమాచల్ ప్రదేశ్, చండీగడ్ కొత్త ఇంచార్జీగా రజనీపాటిల్, హర్యాణా బీకే హరిప్రసాద్, మధ్యప్రదేశ్ హరీశ్ చౌదరి, తమిళనాడు, పుదుచ్చేరి గిరీశ్ చౌడాంకర్, ఒడిశా అజయ్ కుమార్ లల్లూ, జార్ఖండ్ కె.రాజు. మణిపూర్ త్రిపుర, సిక్కిం, నాగాలాండ్ రాష్ట్రాలకు సప్తగిరి శంకర్ ఉల్కా, బీహార్ క్రిష్ణ అల్లవారులను నియమిస్తూ ఏఐసీసీ ప్రకటన విడుదల చేసింది. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీగా దీపాదాస్ మున్షీని తప్పించి..ఆ స్థానంలో మీనాక్షి నటరాజన్ కు బాధ్యతలను అప్పగించారు.
Also Read: BSNL: ఎవడ్రా BSNL పడిపోయిందని చెప్పేది..ఈ లెక్కలు చూసి ఆ మాట చెప్పండి..17ఏళ్ల తర్వాత కోట్లలో లాభాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.