Valentines Day Acid attack: వాలెంటైన్స్‌డే రోజు ఘోరం.. యువతిపై యాసిడ్ దాడిచేసిన ప్రేమోన్మాది.. వీడియో వైరల్..

Acid attack on girl annamayya district: ప్రేమిస్తున్నానని వెంటపడ్డారు. అంతేకాకుండా.. మాట్లాడుకుందామని పిలిచి యువతి తలపై సుత్తెతొ కొట్టి యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది.

Written by - Inamdar Paresh | Last Updated : Feb 14, 2025, 11:51 AM IST
  • యువతిపై యాసిడ్ దాడి..
  • ఆగ్రహాం వ్యక్తం చేస్తున్న స్థానికులు..
Valentines Day Acid attack: వాలెంటైన్స్‌డే రోజు ఘోరం.. యువతిపై యాసిడ్ దాడిచేసిన ప్రేమోన్మాది.. వీడియో వైరల్..

acid attack on girl in annamayya district: వాలెంటైన్స్ డే రోజు చాలా మంది యువత తమ ఇష్టమైన వారిని ఏదో విధంగా సర్ ప్రైజ్ చేయాలనుకుంటారు. అంతేకాకుండా.. తాము మనసారా ప్రేమించిన వాళ్లకు తమ మనసులోని మాటను చెప్పాలని కోరుకుంటారు.  ఈ క్రమంలో వాలెంటైన్స్ డే ను ఎంత మంది వ్యతిరేకించిన కూడా.. యువత మాత్రం ఈ రోజు తాము మనసార ప్రేమించిన వారితో ఫుల్ ఎంజాయ్ చేస్తారు.

అయితే.. అన్నమయ్య జిల్లాలో గుర్రం కొండ మండంలో దారుణంచోటు చేసుకుంది. మదన పల్లెలోని అమ్మచెరువు మిట్టకు చెందిన గణేష్ అనే యువకుడు.. ప్యారం పల్లికి చెందిన యువతిని ప్రేమించాడు. వీళ్లిద్దరు సరదాగా మాట్లాడుకునే వారు. అయితే.. ఆమెకు ఇటీవల పెళ్లి సెటిల్ అయ్యింది. దీంతో ఇద్దరి మధ్య దూరం పెరిగింది. యువతి తనతో మాట్లాడొద్దని తెగేసి చెప్పింది.  ఈక్రమంలో ప్రేమించిన అమ్మాయి దూరం పెట్టడంతో ఆమెపై కోపం పెంచుకున్నాడు.

 

ఎలాగైన ఆమెపై ప్రతీకారం తీర్చుకొవాలని ప్లాన్ చేశాడు. యువతిని మాట్లాడుకుందామని పిలిచాడు. అతగాడి మనసులో ఉన్న సైకోయిజాన్ని యువతి గుర్తించలేకపోయింది. అతని దగ్గరకు వెళ్లగానే..ఇద్దరి మధ్య పెళ్లి విషయంలో వాగ్వాదం జరిగింది. అప్పటికే యువతిని చంపేద్దామని తనతో సుత్తి, యాసిడ్ రెడీ గా పెట్టుకున్నాడు.యువతి తలపై ఇష్టమున్నట్లు సుత్తెతో కొత్తి ఆమె ముఖంపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు.

Read more: Chhaavaa Movie: వాలెంటైన్స్‌డే రోజు ఛావా విడుదల.. షాకింగ్ కామెంట్స్ చేసిన రాజాసింగ్.. ఏమన్నారంటే..?

యువతి కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు రావడంతో అతను పారిపోయాడు. వెంటనే స్థానికులు యువతిని మదనపల్లెలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఈ ఘటన పెను సంచలనంగా మారింది. ఈ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం వైరల్ గామారింది. యువతి తీవ్రంగా గాయపడింది. ఆమెను వైద్యులు ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

Trending News