Cm Revanth reddy comments on caste census and pm modi: తెలంగాణలో ఇటీవల సీఎం రేవంత్ సర్కారు కులగణన సర్వే ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా.. ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు మరోసారి వార్తలలో నిలిచాయి. తెలంగాణలో చేపట్టిన కులగణనను రాహుల్ గాంధీకి క్లియర్ గా వివరించినట్లు రేవంత్ తెలిపారు. ఈ సర్వే పూర్తిగా శాస్త్రియంగా జరిగిందన్నారు. తెలంగాణలో బహిరంగ సభకు సన్నాహాలు చేస్తున్నామని, దీనికి రాహుల్ గాంధీ తప్పక హజరవుతారన్నారు. రాహుల్ గాంధీ చెప్పిన ఆదేశాలను తూచా తప్పకుండా ఫాలో అయినట్లు చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర కులగణన దేశానికి రోడ్ మ్యాప్ వంటిదన్నారు. ప్రతిపక్షాలు కావాలనే కులగణనపై లేని పోనీ రాద్ధాంతం చేస్తున్నాయని సీఎం రేవంత్ మండిపడ్డారు. రాజకీయ కోణంలో కాదు ప్రజా సంక్షేమ కోణంలోనే కులగణన జరిగిందని క్లారిటీ ఇచ్చారు. కావాలనే కొందరు ప్రజలను ఉద్రేకపరిచే విధంగా ప్రయత్నం చేస్తున్నరన్నారు. కులగణనపై అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటుకు బిల్లు తీసుకొస్తామన్నారు.
అదే విధంగా పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో అత్యున్నత ధర్మాసనం ఇచ్చే తీర్పు కోసం వేచిచూస్తున్నామన్నారు. సుప్రీంకోర్టు తీర్పు కంటే ముందే, కేటీఆర్ ఏదేదో చెప్తున్నాడని కూడా మండిపడ్డారు.
సభిత ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు ఏ పార్టీలో గెలిచి, ఏ పార్టీలో మంత్రులుగా పనిచేశారో గుర్తు చేసుకొవాలన్నారు. ప్రధానిని కించపరిచేలా తాను ఎక్కడ కూడా మాట్లాడలేదని, ఉన్నది ఉన్నట్టుగానే చెప్పానని క్లారిటీ ఇచ్చారు. బీజేపీ నేతలు సైతం అదే విషయాన్ని ఒప్పుకున్నారన్నారు.
తాను కొందరికి నచ్చకపోతే.. అది తన సమస్య కాదన్నారు. కానీ నా పని నేను చేస్తున్నని చెప్పారు. తనను ఎవరు కూడా ప్రశ్నించే పరిస్థితి తెచ్చుకొనని అన్నారు. కాంగ్రెస్ తరపున ప్రజలకు హామీ ఇచ్చింది నేను.. అమలు చెయ్యక పోతే అడిగేది నన్నే.. అంటూ స్పష్టం చేశారు.
కొంతమంది నాపై అబద్ధపు ప్రచారాలు చేసి , పైశాచిక ఆనందం పొందుతున్నారని అలాంటి ఆరోపణల్ని పట్టించుకొనేది లేదని క్లారిటీ ఇచ్చారు. క్యాబినెట్ విస్తరణ నా ఒక్కడి నిర్ణయం కాదని.. కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాలు అందరు పాటించాల్సిందేనని స్పష్టం చేశారు.
ఎవరు ఏమనుకున్నా, ఎలాంటి విమర్శలు చేసిన తలొగ్గేది లేదన్నారు. పీసీసీ కార్యవర్గం, మంత్రివర్గ విస్తరణ తదితర అంశాలపై కొందరు పైశాచిక ఆనందం కోసం ఊహాగానాలు వ్యాప్తి చేస్తున్నారని, అంతిమంగా కాంగ్రెస్ హైకమాండ్ తీసుకునే నిర్ణయం ప్రకారం ముందుకు వెళ్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter