Man Brutally murdered on medchal video: హైదరబాద్ ఇటీవల పట్టపగలు ఘోరాలు జరిగిపోతున్నాయి. కత్తిపట్టుకుని పట్టపగలే హత్యలు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల రియల్ ఎస్టేట్ మర్డర్ లు, మరికొన్ని చోట్ల ఆస్తితగాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇంకా కొన్ని చోట్ల ప్రేమ వ్యవహారాలు కూడా హత్యలకు దారి తీస్తున్నాయి. మొత్తంగా హైదరాబాద్ లో మేకను, కొడిని చంపినట్లు.. ఈజీగా తమకు నచ్చని వాళ్లను అత్యంత ఘోరంగా, కిరాతకంగా హతమారుస్తున్నారు.
ఈ క్రమంలో ప్రస్తుతం మేడ్చల్ లో నడిరోడ్డు మీద దారుణం చోటు చేసుకుంది. ఒక యువకుడ్ని.. ఇద్దరు వ్యక్తులు కత్తులతో అత్యంత.. విచక్షణ రహితంగా నరికి చంపారు. కామారెడ్డి జిల్లా మాచ రెడ్డి గ్రామానికి చెందిన ఉమేష్ (25) తన కుటుంబ సభ్యులతో మేడ్చల్ లో నివాసం ఉంటున్నారు.
మేడ్చల్.. పట్టపగలు నడిరోడ్డుపై హత్య#Medchal #Hyderabad #Telangana #MedchalMurder pic.twitter.com/UTSmHj14WN
— తెనాలి రామకృష్ణుడు (@vikatakavi369) February 16, 2025
జాతీయ రహదారి నడిరోడ్డు పై ఇద్దరు వ్యక్తులు ఉమేష్ ను కత్తులతో నరికి దారుణంగా హత్య చేశారు. దీంతో అక్కడి నుంచి వాహానాలలో వెళ్తున్నవారు భయంతో దూరంగా తమ వాహానాల్ని ఆపేశారు. స్థానికులు భయంతో వణికిపోయారు. హత్య చేసిన అనంతరం ఇద్దరు దుండగులు సంఘటన స్థలం మెల్లగా రోడ్డు క్రాస్ చేసి మరీ పారిపోయారు.
మేడ్చల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.ప్రస్తుతం ఈ ఘటనకు అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. ఈ హత్య కాండ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter