Singer mangli letter on political controversy: సింగర్ మంగ్లీ మరోసారి వార్తలలో నిలిచారు. కొన్ని రోజులుగా సింగర్ మంగ్లీని సోషల్ మీడియాలో తెగ ట్రోల్స్ చేస్తున్నారు. గతంలో వైసీపీ హాయాంలో సింగర్ మంగ్లీ.. టీడీపీ వాళ్లను చులకనగా చూసిందన్నారు. ఒకసారి పాటను పాడాలని కోరితే.. ముఖం మీద పాడనంటూ తేగేసి చెప్పిందని టీడీపీ నేతలు ఆరోపణలు చేశారు. మరొవైపు ఇటీవల రథ సప్తమి వేళ అరసవెల్లికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు.. మంగ్లీని ప్రొటోకాల్ లో స్పెషల్ గా దర్శనం కల్పించడం కూడా వివాదానికి దారితీసింది. దీనిపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున విమర్శలు చేశారు.
ఇది ప్రస్తుతం ఇరు తెలుగు స్టేట్స్ ల మధ్య వివాదంగా మారింది. దీనిపై తాజాగా.. మంగ్లీ ఒక బహిరంగా లేఖను విడుదల చేశారు. గతంలో 2019 ఎన్నికల సమయంలో వైసీపీ పార్టీ వారు కోరితే .. పాటను పాడారన్నారు.అంతే కాకుండా.. 2024లో ఎక్కడ కూడా ఎన్నికలో పాటను పాడలేదన్నారు. తాను.. టీడీపీ వారు కోరితే.. పాటను పాడనని చెప్పానని అనడంతో నిజంలేదన్నారు. ఒక వేళ నిరూపిస్తే దేనీకైన సిద్దమన్నారు.
అంతేకాకుండా.. జగన్ కోసం పాటను పాడటం వల్ల చాలా అవకాశాలు కోల్పోయానన్నారు. అంతేకాకుండా.. వెంకటేశ్వర స్వామి తమ ఇంటి దైవమని.. జగన్ సర్కారు ఎస్వీబీసీ సలహాదారుగా ఉండమంటే.. తన ఇంటి దైవమని ఒప్పుకున్నట్లు చెప్పారు.
తనకు మొదటి నుంచి చంద్రబాబు నాయుడు అంటే ప్రత్యేకంగా అభిమానమన్నారు. ఆయన ఒక విజన్ ఉన్న నేత అని చెప్పుకొవచ్చు. తనకు ఏ రాజకీయ పార్టీలతో పెద్దగా సంబంధాలు లేవని.. దయచేసి తనకు రాజకీయాలు ఆపాదించొద్దని కూడా మంగ్లీ ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తు ఒక బహిరంగ లేఖను సైతం విడుదల చేశారు. దీంతో సింగర్ మంగ్లీ అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter