Ram Pothineni dating: ప్రస్తుతం ఉన్న తెలుగు హీరోలు.. ఇంకా పెళ్లి చేసుకోకుండా మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఉండేది రామ్. దేవదాసు సినిమాతో పరిచయమైన ఈ హీరో.. ఇప్పటివరకు ఎప్పుడు పెళ్లి ప్రస్తావన తీసుకురాలేదు. ఈ క్రమంలో మిస్టర్ బచ్చన్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన భాగ్యశ్రీ బోర్సేతో.. రామ్ పోతినేని ప్రేమలో పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి.. దేవదాస్ సినిమా ద్వారా పరిచయమైన రామ్ పోతినేని గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. మోస్ట్ టాలెంటెడ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఈయన అదృష్టం లేక స్టార్ హీరో రేంజ్ కి ఎదగలేకపోయారు.
అయితే తెలుగు హీరోల్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. ఇండస్ట్రీలోకి వచ్చి ఇన్నేళ్లు అవుతున్నా.. ఇంకా పెళ్లి చేసుకోకపోవడం పై పలువురు కామెంట్లు చేస్తూ ఉండగా.. తాజాగా ఈయన ప్రేమలో లో పడినట్లు సమాచారం.
రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ సినిమాలో హీరోయిన్గా నటించిన భాగ్యశ్రీ బోర్సేతో రామ్ ప్రస్తుతం డేటింగ్ చేస్తున్నట్లు సమాచారం.రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమా డిజాస్టర్ గా నిలిచినా.. ఈ సినిమాలో అమ్మడి నటనకు అందానికి అభిమానులు ఫిదా అయ్యారు.
ప్రస్తుతం రామ్ పోతినేని నటిస్తున్న ఒక సినిమాలో హీరోయిన్గా భాగ్యశ్రీ అవకాశాన్ని అందుకుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతూ ఉండగా అక్కడే వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నట్లు.. సమాచారం. ప్రముఖ వెబ్సైట్ ఏషియా నెట్ కథనాల ప్రకారం.. వీరిద్దరూ ప్రేమలో ఉన్నాడని తెలుస్తోంది.
ఏది ఏమైనా కలిసిన రెండు నెలలలోనే పరిచయం, ప్రేమ ఇప్పుడు డేటింగ్ అన్ని చూసి.. హీరో చాలా ఫాస్ట్ గా ఉన్నాడని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే దీనిపై నిజానిజాలు తెలియాల్సి ఉంది.