Ketu Transit 2025: సింహ రాశిలోకి కేతువు గ్రహం.. ఈ రాశులవారికి ఊహించని డబ్బు, లగ్జరీ లైఫ్‌!


Ketu Transit 2025: ఎంతో శక్తివంతమైన కేతువు గ్రహం సింహ రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా తులా రాశితో పాటు కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా ఆర్థికంగా వస్తున్న సమస్యలు కూడా తొలగిపోతాయి. 

Ketu Transit 2025 Effect On Zodiac Signs: జ్యోతిష్య శాస్త్రంలో తొమ్మది గ్రహాలు ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. ఇందులో కొన్ని కీడు గ్రహాలు ఉంటే.. మరికొన్ని శుభ గ్రహాలు ఉంటాయి. ఇందులో కీడు గ్రహాలు జాతకంలో అశుభ స్థానంలో ఉంటే అనేక సమస్యలు వస్తాయి. అలాగే దీర్ఘకాలికంగా కూడా ఆర్థికంగా నష్టపోతారు. అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో కీడు గ్రహాలు కూడా శుభఫలితాలను అందిస్తాయి. 
 

1 /6

ఎంతో ప్రాముఖ్యత కలిగిన కేతువు గ్రహం సింహ రాశిలోకి ప్రవేశించబోతోంది. దీని కారణంగా మూడు రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అలాగే ఆర్థిక పరంగా వస్తున్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.   

2 /6

తులా రాశికి కూడా ఈ కేతువు గ్రహం సంచారం వల్ల అద్భుతమైన లాభాలు కలుగుతాయి. వీరికి అనుకున్న పనుల్లో ఊహించని లాభాలు పొందుతారు. అంతేకాకుండా కెరీర్‌ పరంగా కూడా వీరికి చాలా బాగుంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అలాగే వ్యాపారాల్లో కూడా ఊహించని స్థాయిలో లాభాలు కలుగుతాయి.  

3 /6

ముఖ్యంగా తుల రాశివారికి కుటుంబంలో ఆనందం కూడా రెట్టింపు అవుతుంది. అలాగే మానసిక శాంతి కూడా విపరీతంగా పెరుగుతుంది. అలాగే ఆనందం కూడా రెట్టింపు అవుతుందని జ్యోతిష్యలు తెలుపుతున్నారు. దీంతోపాటు ఆర్థిక స్తోమత కూడా పెరుగుతుంది.   

4 /6

మేష రాశివారికి కెరీర్‌ పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది. వీరికి పదోన్నతులు లభించడమే కాకుండా సంపద కూడా విపరీతంగా పెరుగుతుంది. కెరీర్‌ పరంగా వస్తున్న సమస్యలు కూడా దూరమవుతాయి. దీంతో పాటు ఎలాంటి పనులు చేసిన అద్భుతమైన లాభాలు పొందుతారు.  

5 /6

వ్యాపారాలు చేసే మేష రాశివారికి కూడా ఈ సమయం ఎంతో బాగుటుందుంది. కేతువు అనుగ్రహం వల్ల అద్భుతమైన లాభాలు పొందుతారు. ముఖ్యంగా ఎంతో కష్టపడి పనులు చేసేవారికి కోరికలన్నీ సులభంగా నెరవేరుతాయి. అలాగే అదృష్టం కూడా వరిస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.   

6 /6

కేతువు ఎఫెక్ట్‌ వల్ల కన్య రాశివారికి కూడా అద్భుతమైన లాభాలు కలుగుతాయి. వీరికి ఉద్యోగంలో పదోన్నతులు లభించి.. జీతాలు కూడా విపరీతంగా పెరుగుతాయి. అంతేకాకుండా పెడింగ్‌లో ఉన్న పనులు కూడా సులభంగా నెరవేరుతాయి. అలాగే ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.