Sukanya Samriddhi Yojana: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చే స్కీములను సద్వినియోగం చేసుకుంటే తక్కువ పెట్టుబడితో రెండింతల లాభాలను పొందవచ్చు. ఆడపిల్లలు భవిష్యనిధిగా తీసుకువచ్చిన సుకన్య సమృద్ధి పథకం కూడా అటువంటిదే. ఈ పథకం ద్వారా ఎంత లాభం పొందవచ్చు. ఎవరు అర్హులు అనే విషయాలు తెలుసుకుందాం.
Sukanya Samriddhi Yojana:ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రుల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సుకన్య సమృద్ధి పథకంలో ఇటీవల వడ్డీరేటును పెంచిన సంగతి తెలిసిందే. ఈ స్కీములో నెలకు రూ. 4వేల పెట్టుబడితో రెండింతల ప్రయోజనాలు పొందవచ్చు. మీరు మీ ఇంట్లో ఆడపిల్లల చదువులు, పెళ్లిళ్లు ఎలాంటి అవసరం వచ్చిన చింత లేకుండా గడపవచ్చు.
ఇటీవల కేంద్రం ఈ పథకంలో వడ్డీ రేటును 8శాతం నుంచి 8.2కి పెంచింది. లాంగ్ టర్మ్ ఇన్వెస్టిమెంట్ తో భారీ మొత్తాన్ని నిర్ణీత సమయంలో అందించడమే దీని ప్రత్యేకత అని చెప్పవచ్చు. ఆడపిల్లలు 10ఏళ్లలోపు ఉన్నవారు ఉంటే ఎవరైనా ఈ పథకం కోసం రాయించుకోవచ్చు.
ఉదాహరణకు మీ కూతురుకు 5సంవత్సరాలు ఉన్నాయనుకుంటే..2024లో మీరు ఈ పథకంలో చేరారు. 2045 వచ్చే వరకు మీరు రాబడిని పొందవచ్చు. నెల నెలా రూ. 4వేలు జమ చేసినా ఏడాదికి ఈ మొత్తం రూ. 48, 000 జమ అవుతుంది. ఇలా 15ఏళ్ల పాటు అంటే 2042 వరకు చేయాల్సి ఉంటుంది.
ఈ స్కీములో మీరు జమ చేసిన మొత్తం రూ. 7లక్షల 20వేలు అవుతుంది. అప్పుడు మీకు వచ్చే మొత్తం 15.14 లక్షలు అవుతుంది. అదే మీరు పూర్తి మెచ్యూరిటీ సమయానికి తీసుకోగలిగితే ఇది మొత్తం 22 లక్షల 34వేలు అవుతుంది.
10 సంవత్సరాల వయసు ఉన్న ఆడపిల్లల పేరిట పేరెంట్స్ లేదా గార్డియెన్స్ ఈ ఖాతాను తీసుకోవచ్చు. ఒక కుటుంబానికి రెండు అకౌంట్లు మాత్రమే ఇస్తారు. ఒక వేళ తల్లికి రెండో కాన్పులో కవల ఆడపిల్లలు పుట్టినట్లయితే మూడో ఖాతాను కూడా తీసుకోవచ్చు.
సుకన్య సమృద్ధి ఖాతా తీసుకునేందుకు కూతురు బర్త్ సర్టిఫికేట్, ఎస్ఎస్ వై అకౌంట్ ఓపెనింగ్ ఫామ్, తల్లిదండ్రులు లేదా గార్డియెన్స్ అడ్రస్ ప్రూఫ్, ఐడీ ప్రూఫ్ అవసరం అవుతాయి.