Telangana Women Free Bus Scheme: తెలంగాణలోని రేవంత్ రెడ్డి సర్కారు.. ఒక్కో పథకం విషయంలో వెనకడుగు వేస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఉచిత బస్సు పథకం విషయంలో మహిళలకు షాక్ ఇస్తోంది రేవంత్ సర్కార్. ఫ్రీ బస్సులను క్రమంగా తగ్గిస్తోంది తెలంగాణ ఆర్టీసీ.
ఏడాదిలోనే దాదాపు 2 వందలకు పైగా మహిళలు ఫ్రీగా జర్నీ చేసే ఆర్జినరి,ఎక్స్ ప్రెస్ బస్సులను తగ్గించారు. 2024 మార్చి నుంచి 2025 జనవరి వరకు దాదాపు 100కు పైగా పల్లె వెలుగు ఆర్జినరి బస్సులు, మరో వంద వరకు పల్లె వెలుగు ఎక్స్ ప్రెస్ బస్సులు తగ్గినట్లు ఆర్టీసీ అధికారుల లెక్కలు చెబుతున్నాయి.
ఇదీ చదవండి: అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే..
అదే సమయంలో గతంలో కంటే సూపర్ లగ్జరీ, డీలక్స్ బస్సులు పెరిగాయి. ఫ్రీ జర్నీకి అవకాశం లేకుండా ఎక్స్ ప్రెస్ బస్సులనే సూపర్ లగ్జరీ, డీలక్స్‌గా మార్చారనే ఆరోపణలు వస్తున్నాయి. ఫ్రీ బస్సు పథకం తర్వాత మహిళా ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. రోజు దాదాపు 30 లక్షల మంది ప్రయాణిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే మహిళా ప్రయాణికుల కోసం ఫ్రీ బస్సులను పెంచాల్సిన ప్రభుత్వం తగ్గించడంపై జనాలు మండిపడుతున్నారు. మొత్తంగా ఒక చేత్తో ఇచ్చి మరొ చేత్తో లాక్కోవడంపై మహిళ ప్రయాణికులు మండిపడుతున్నారు.
ఇదీ చదవండి: తాగుడుకు బానిసై సినీ కెరీర్ నాశనం.. 44 ఏళ్ల వయసులో స్టార్ హీరోయిన్ రెండో పెళ్లి..
ఇదీ చదవండి: వై టార్గెట్ చిరంజీవి.. ? మెగా ఫ్యామిలీని కావాలనే టార్గెట్ చేశారా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.