BRS Party Full Josh: అధికారం కోల్పోవడంతో కంచుకోటగా ఉన్న జిల్లాలో కూడా ప్రతికూల ఫలితాలు వచ్చిన నేపథ్యంలో గులాబీ పార్టీ మళ్లీ పూర్వ వైభవం కోసం తహతహలాడుతోంది. ఎంపీ సీటును కూడా కోల్పోవడంతో బీఆర్‌ఎస్ పార్టీ గత వైభవం కోసం భారీ వ్యూహం రచిస్తోంది. జిల్లాలో ఏక చత్రాధిపత్యం కొనసాగిస్తున్న ట్రబుల్ షూటర్‌తో పార్టీకి మళ్లీ మంచి రోజులు రావాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీశ్ రావు పాదయాత్ర చేపట్టబోతున్నారని సమాచారం. పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల అనంతరం పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారని తెలుస్తోంది.
Also Read: MLC Elections: ఎన్నికల్లో గులాబీ పార్టీ దూరం.. బీజేపీ, కాంగ్రెస్‌ల్లో 'రాజకీయం' కాక
అధికారంలో ఉన్నప్పుడు మెదక్ జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులను బీఆర్‌ఎస్ పార్టీ ప్రభుత్వం చేపట్టింది. ఈ ప్రాజెక్టులను పూర్తి చేయాలని నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు తీసుకున్నారు. అయితే అనూహ్యంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆ ప్రాజెక్టులపై నీలి మేఘాలు అలుముకున్నాయి. ప్రాజెక్టులను పూర్తి చేయకపోవడంతో ఇదే డిమాండ్‌తో నాటి నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీశ్ రావు తాజాగా పాదయాత్ర చేపట్టనున్నారు. సంగమేశ్వర ఆలయం వద్ద నుంచే పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు.
Also Read: Gudem Mahipal Reddy: కాంగ్రెస్‌లో 'గూడెం' గూడుపుఠాణీ.. పటాన్‌చెరులో చెడుగుడే!
సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టుల నిర్దేశిత ఆయకట్టు ప్రాంతాల్లో వారం రోజులు.. 130 కిలోమీటర్లు హరీశ్ రావు పాదయాత్ర చేస్తారని బీఆర్‌ఎస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి. గ్రామాల్లో రోజుకో సభ.. చివరి రోజు సభకు పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతున్నారని గులాబీ పార్టీ చెబుతోంది. ఈ విషయంపై ఇప్పటికే పార్టీ శ్రేణులతో చర్చించారని.. ప్రణాళిక కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ పాదయాత్రపై హరీశ్ రావు, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇంకా అధికారిక వెలువడలేదు.
సమీకరణాలు మారే ఛాన్స్?
రాష్ట్ర రాజకీయాల్లో ట్రబుల్ షూటర్‌గా పేరొందిన హరీశ్ రావు పాదయాత్ర చేపడితే రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. మెదక్ జిల్లాలో పార్టీకి కొంత గడ్డు పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో.. జిల్లాను శాసిస్తున్న హరీశ్ రావుకు కొంత ప్రతికూల వాతావరణం ఏర్పడింది. ఈ నేపథ్యంలో మళ్లీ పూర్వ వైభవం పొందాలంటే హరీశ్ రావు క్షేత్రస్థాయిలో పర్యటించాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర లేదా.. పర్యటన చేపట్టాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. దానికోసం కార్యాచరణ సిద్ధమవుతోంది.
ఈ క్రమంలోనే హరీశ్ రావు కూడా పాదయాత్ర చేపడితే మెతుకు సీమలో గులాబీ పార్టీకి తిరుగుండదని రాజకీయ వర్గాలు వెల్లడిస్తున్నాయి. హరీశ్ రావుకు మాస్ ప్రజల్లో భారీగా ఫాలోయింగ్ ఉండడంతోపాటు రేవంత్ రెడ్డి వైఫల్యాలతో ప్రజలు ఈ యాత్రకు బ్రహ్మరథం పట్టే అవకాశాలు లేకపోలేదు. మరి ఏం జరుగుతుందో? హరీశ్ రావు పాదయాత్ర చేపడతాడా? అనేది కొన్ని రోజులు ఆగాల్సి ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.