Whale attacking on boat and trying to swallow man video: సాధారణంగా చాలా మంది సముద్రంలో వెళ్లి స్నానం చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. కొంత మంది సముద్రం ఒడ్డున ఉండి స్నానం చేస్తుంటే.. మరికొందరు సముద్రంలోపలికి వెళ్లి సర్ఫింగ్ చేస్తుంటారు. బోట్ లలో తిరుగుతుంటారు. అయితే.. కొన్నిసార్లు సముద్రంలో బలమైన అలలు మనిషిని సముద్రంలోకి లాక్కెళ్లిపోతాయి.
అంతే కాకుండా.. సముద్రంలో ఉండే తిమింగిలాలు ఒడ్డుకు వచ్చి దాడులు సైతం చేస్తుంటాయి. అయితే.. సముద్రంలో బోట్ మీదకు వెళ్లిన తండ్రి కొడుకులకు భయానక అనుభవం ఎదురైంది. ఈ ఘటన వైరల్ గా మారింది.
NEW 🔴
A kayaker off Chile was swallowed by a humpback whale but somehow emerged unharmed. pic.twitter.com/VOhTw3zJq6
— Open Source Intel (@Osint613) February 13, 2025
పటగోనియా సముంద్రంలో బోట మీద డేల్, ఆడ్రియన్లు వెళ్లారు. అయితే.. కొడుకు బోటింగ్ చేస్తుండగా.. తండ్రి వీడియో తీస్తున్నాడు. ఇంతలో ఒక భారీ తిమింగిలం కొడుకు బోట్ తో సహా మింగేసింది. అతను చూస్తుండగానే కొడుకు మాయమైపోయాడు. వెంటనే సెకన్ ల వ్యవధిలోనే తిమింగిలం మరల బోట్ ను బైటకు కక్కేసింది. వెంటనే కొడుకు స్పీడ్ గా బోట్ నడిపిస్తు తండ్రి వద్దకు చేరుకున్నాడు.
తండ్రి కూడా కొడుకుకు ధైర్యం చెబుతూ.. అక్కడి నుంచి వెంటనే ఒడ్డుకు చేరుకున్నారు. అయితే.. రెప్పపాటులో చావు అంచుల వరకు వెళ్లి అతను బైటపడ్డాడు. తిమింగిలం బోట్ ను మింగినప్పుడు దాని గోంతుకు ఏదో ఇబ్బందిగా అన్పించి, బైటకు ఉమ్మివేసిందని అక్కడి వారు అంటున్నారు. బోట్ లేకుంటే.. ఆ వ్యక్తిని అమాంతంలో కొరికి మింగేసేదని అక్కడి వాళ్లు చెప్తున్నారు.
Read more:
మొత్తంగా సదరు వ్యక్తులు చావు అంచుల వరకు వెళ్లి వచ్చారని చెప్పుకొవచ్చు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఆ సీన్ చూస్తుంటే.. గూస్ బంప్స్ వస్తున్నాయని...గుండెలు జారీ పోయే విధంగా ఉన్నాయని కొంత మంది నెటిజన్ లు కామెంట్లు చేస్తున్నారు.ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter