BPCL Offer: మీకు టూవీలర్ ఉందా. అయితే మీరు ఫ్రీగా పెట్రోల్ పొందవచ్చు. ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థ భారత్ పెట్రోలియం ఫౌండెషన్ డే ఫెస్ట్ ఆఫర్ 2025ను తీసుకువచ్చింది. ఫ్రీ పెట్రోల్ తోపాటు రూ. 1000 కూపన్ కూడా పొందవచ్చు. అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.
BPCL Offer: ప్రస్తుతం దేశంలో పెట్రోల్ ధరలు భారీగానే పెరిగాయి. సార్వత్రిక ఎన్నికలకు ముందు స్వల్పంగా తగ్గించిన కేంద్ర ప్రభుత్వం ఆ తర్వాత ఎలాంటి మార్పు చేయలేదు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గినప్పుడు కూడా దేశీయంగా ధరలు తగ్గలేదు.
దీంతో వాహనదారులపై అదనపు భారం పడుతుందని చెప్పవచ్చు. వాహనదారులు ముఖ్యంగా ద్విచక్రవాహనదారులు ఎక్కడ పెట్రోల్ తక్కువ ధర లభిస్తోందని వెతుకుతుంటారు.
క్రెడిట్ కార్డుల ద్వారా పెట్రోల్ కొట్టించుకుని సర్ ఛార్జీలను తగ్గించుకోవాలని ప్లాన్ చేస్తుంటారు. ఎంతో కొంత్త భారం తగ్గుతుందన్న భావనలో ఉంటారు. అయితే అలాంటి వారందరికీ ఓ బంపర్ ఆఫర్ ఉంది.
ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఫౌండేషన్ డే ఫెస్ట్ తీసుకువచ్చింది. ఈ సంస్థ ప్రారంభించిన 45 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక ఆఫర్ తీసుకువచ్చింది. ఈ ఆఫర్ జనవరి 24, 2025నే మొదలైంది
ఈ ఫిబ్రవరి 28,2025 వరకు ఫౌండేషన్ డే ఫెస్ట్ ఆఫర్ కొనసాగుతుంది. టూవీలర్ లకు ఫ్రీగా పెట్రోల్ పొందడంతోపాటు రూ. 1000కూపన్ పొందవచ్చు.ఈ ఆఫర్ ఎంపిక చేసిన బీపీసీఎల్ ఫ్యూయల్ స్టేషన్లో అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. ఈ ఆఫర్ గురించి పూర్తి వివరాలు చూద్దాం.
ఈ ఆఫర్ ఫిబ్రవరి 28 వరకు ఉంటుంది. ఈ ఆఫర్ సమయంలో టూ వీలర్ యూజర్లు 1 మ్యాక్ 4టీ ట్యూబ్రికెంట్ ఆయిల్ కొనుగోలు చేయాలి. ఈ ఆయిల్ ఎంపిక చేసిన బీపీసీఎల్ ఫ్యూయల్ స్టేషన్లో ప్రీగానే మారుస్తారు. ఈ ఆయిల్ మార్చుకున్న ప్రతిసారీ రూ. 75 విలువైన పెట్రోల్ ఉచితంగా లభిస్తుంది. ఆ పైన రూ. 1000 వరకు విలువైన స్క్రాచ్ కూపన్ కూడా లబిస్తుంది. టూ వీలర్ ఉన్న వారికి ఇది మంచి ఛాన్స్ అని చెప్పవచ్చు.
ఉచితంగా ఆయిల్ ఛేంజ్ చేసుకోవడంతోపాటు ఉచిత పెట్రోల్ స్క్రాచ్ కార్డ్ కూడా పొందవచ్చు. దాని ద్వారా రూ. 1000 వరకు పొందే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు సమీపంలోని బీపీసీఎల్ పెట్రోల్ బంకులను సంప్రదించవచ్చు.