Water Disruption on February 17: హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై సివరేజ్ బోర్డు (HMWSSb) 24 గంటల పాటు వాటర్ సప్లై నిలిపివేయనుంది. ఈ మేరకు ప్రజలకు సర్క్యూలర్ విడుదల చేసింది. ఫిబ్రవరి 17వ తేదీ ఉదయం 6 గంటల నుంచి నీటి సరఫరా నిలిపివేయనుంది. కొండపాక పంపింగ్ స్టేషన్ వాల్వ్ రీప్లేస్మెంట్ నేపథ్యంలో నీటి సరఫరా నిలిపివేయనున్నారు. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం
హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్ 24 గంటల పాటు నేటి సరఫరా నిలిపివేయనుంది హెచ్‌ఎండబ్ల్యూఎస్‌బీ. ఈ నేపథ్యంలో ప్రజలు నీటి వాడకంలో జాగ్రత్త పాటించాలి. ముఖ్యంగా కొండపాక పంపింగ్ స్టేషన్ వద్ద ఉన్న ప్రధాన వాల్వును రీప్లేస్మెంట్ చేయనున్న నేపథ్యంలో 24 గంటల పాటు నీటి సరఫరాను నిలిపివేయనున్నారు. ఇది ఏ ప్రాంతాలను ప్రభావితం చేస్తుంది పూర్తి వివరాలు తెలుసుకుందాం..
ఫిబ్రవరి 17వ తేదీన సోమవారం నీటి సరఫరాలో అంతరాయం కలగనుంది. హైదరాబాదులోని పలు ప్రాంతాలలో ఈ నేపథ్యంలో నీటి సరఫరా నిలిపివేయనున్నారు. ముఖ్యంగా ఎస్‌ఆర్ నగర్, సనత్ నగర్, బోరబండ, ఎర్రగడ్డ, బంజార హిల్స్, వెంగళరావు నగర్, ఎల్లారెడ్డి గూడా, సోమాజిగూడ, ఫతేనగర్, కూకట్‌పల్లి, వివేకానంద నగర్, ఎల్లమ్మబండ, మూసాపేట్, భరత్ నగర్ ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిపివేయనున్నారు.
కేపీహెచ్‌బీ, బాలాజీ నగర్, హస్మత్ పెట్, మోతి నగర్, గాయత్రి నగర్, చింతల్, సుచిత్ర, జీడిమెట్ల, షాపూర్ నగర్, గాజులరామారం, సూరారం, ఆదర్శ్ నగర్, అల్వాల్, మచ్చ బొల్లారం, డిఫెన్స్ కాలనీ, చాణిక్యపురి, గౌతమ్ నగర్ వంటి ప్రాంతాల్లో కూడా నీటి సరఫరా నిలిపివేయనున్నారు.
ఈ ప్రాంతాల్లో మాత్రమే కాకుండా ముఖ్యంగా చర్లపల్లి, సాయిబాబా నగర్, కొండాపూర్, మాదాపూర్, హఫీజ్ పేట్, మియాపూర్, కొంపల్లి ,తూముకుంట, బాచుపల్లి, గండి మైసమ్మ, తెల్లాపూర్, బొల్లారం త్రిశూల్ లైన్స్, హకీంపేట ఎయిర్ ఫోర్స్, సికింద్రాబాద్, కంటోన్మెంట్ వంటి ప్రాంతాల్లో కూడా నీటి సరఫరా లో అంతరాయం కలగనుంది.
9 ఎంఎం డయామీటర్ వాల్వ్ రీప్లేస్మెంట్ లో భాగంగా ఈ నీటిని సరఫరా నిలిపివేయనున్నారు. కొండపాక పంపింగ్ స్టేషన్లో బిఎఫ్, ఎన్ఆర్విఎస్ రెండిటికి వాల్వులో మార్పులు చేయనున్నారు. ఇది జీడిడబ్ల్యూఎస్ఎస్ ఫేస్ 1 MS పంపింగ్ మెయిన్ 3000 డయామీటర్లో భాగం.