Upcoming compact SUV: మీరు కొత్త కాంపాక్ట్ SUV కొనాలని ఆలోచిస్తుంటే, కొన్ని రోజులు ఓపిక పట్టండి. ఎందుకంటే మారుతి నుండి మహీంద్రా వరకు కొత్త మోడళ్లను విడుదల చేయబోతున్నారు. వాటి గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Upcoming compact SUV: 2025 సంవత్సరం కొత్త కార్లకు చాలా ప్రత్యేకంగా ఉండబోతోంది. మీరు కొత్త కాంపాక్ట్ SUV కొనాలని ప్లాన్ చేస్తుంటే,మీకోసమే ఈ న్యూస్. మారుతి నుండి మహీంద్రా వరకు, ఈ ఏడాది చాలా కంపెనీలు కార్లను మార్కెట్లోకి విడుదల చేయబోతున్నాయి. భారతదేశంలో కాంపాక్ట్ SUV విభాగం చాలా పెద్దది ఈ విభాగం ఇప్పుడు మరింత వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ సంవత్సరం విడుదల కానున్న వాహనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మారుతి సుజుకి ఫ్రాంక్స్ హైబ్రిడ్: ఈ సంవత్సరం మారుతి సుజుకి తన ప్రసిద్ధ SUV ఫ్రాంక్స్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను తీసుకువస్తోంది. ఈసారి ఈ SUVలో హైబ్రిడ్ టెక్నాలజీ కూడా కనిపిస్తుంది. కొత్త ఫ్రాంక్స్‌లో Z సిరీస్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇదే ఇంజన్ ప్రస్తుతం కంపెనీ స్విఫ్ట్, డిజైర్‌లకు శక్తినిస్తుంది. కొత్త హైబ్రిడ్ మైలేజ్ లీటరుకు 30 కిలోమీటర్లు ఉంటుందని కంపెనీ తెలిపింది. దీని ధర రూ. 10 లక్షల నుండి ప్రారంభం కావచ్చు.
టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ టాటా పంచ్ కొంతకాలంగా అందుబాటులో ఉంది. కానీ దాని డిజైన్‌లో గణనీయమైన మార్పులు కనిపించలేదు. ఈ SUV ఇప్పటికీ డిజైన్, నాణ్యత పరంగా నిరాశపరిచింది. కానీ ఇప్పుడు కంపెనీ ఈసారి దాని డిజైన్‌లో చాలా అప్ డేట్స్ తో మార్కెట్లో రానుంది. దాని లోపలి భాగంలో కూడా పెద్ద మార్పులు చూడవచ్చు. కానీ అదే 1.2లీ పెట్రోల్ ఇంజన్ కొత్త పంచ్‌లో అందుబాటులో ఉంటుంది. కొత్త మోడల్ ప్రస్తుత మోడల్ కంటే కొంచెం ఖరీదైనది కావచ్చు ఎందుకంటే ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఉండవచ్చు.
మహీంద్రా XUV 3XO EV: మహీంద్రా తన కాంపాక్ట్ SUV XUV 3XO ను విడుదల చేయబోతోంది. కానీ ఈసారి అది ఎలక్ట్రిక్ అవతార్‌లో వస్తుంది. ప్రస్తుతం, ఈ వాహనం టెస్టింగ్ జరుగుతోంది. మహీంద్రా XUV 3XO EV అనేది ఒక ఎంట్రీ-లెవల్ ఎలక్ట్రిక్ SUV, ఇది XUV 4OO క్రింద ఉంటుంది. భారతదేశంలో, ఇది టాటా నెక్సాన్ EV పంచ్ EV లతో పోటీ పడనుంది. భారతదేశంలో ఈ కొత్త ఎలక్ట్రిక్ SUV ధర రూ. 12 నుండి 15 లక్షల మధ్య ఉండవచ్చు. దాని డిజైన్‌లో కూడా కొన్ని మార్పులు చూడవచ్చు…